K Vijaya Bhaskar: మరో ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా ఇది..

ABN, Publish Date - Jul 27 , 2024 | 05:06 PM

‘నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి’ వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌భాస్క‌ర్. ఆయన ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. అదే ‘ఉషా ప‌రిణ‌యం’. ఈ చిత్రానికి ‘ల‌వ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనేది ఉప‌శీర్షిక‌. కె. విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కాబోతోన్న సందర్భంగా.. మీడియాకు ఆయన ఈ చిత్ర విశేషాలు తెలిపారు.

K Vijaya Bhaskar and Usha Parinayam Movie Still

‘నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి’ వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌భాస్క‌ర్ (K Vijaya Bhaskar). ఆయన ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. అదే ‘ఉషా ప‌రిణ‌యం’ (Usha Parinayam). ఈ చిత్రానికి ‘ల‌వ్ ఈజ్ బ్యూటీఫుల్’ (Love Is Beautiful) అనేది ఉప‌శీర్షిక‌. కె. విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌ (Sree Kamal), తాన్వీ ఆకాంక్ష‌ (Tanvi Akaanksha), సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా దర్శకుడు కె. విజయ్‌భాస్కర్‌ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

చాలా గ్యాప్ తర్వాత ‘ఉషా పరిణయం’ వంటి మీ మార్క్ టైటిల్‌తో సినిమా చేశారు.. ఈ కథ గురించి ఏమైనా..?

‘ఉషా పరిణయం’ ప్రేమకు నేను ఇచ్చే నిర్వచనం. ఈ మధ్య ప్రేమకు అర్థం మారిపోయింది. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరగడం ఎక్కువైపోయింది. నిజం చెప్పాలంటే అసలు అది ప్రేమకాదు. ఇలాంటి దాడులు జరిగినప్పుడు అందరూ ప్రేమోన్మాదం అని రాస్తున్నారు.. దయచేసి అలా రాయకండి.. ఎందుకంటే అది ఓన్లీ ఉన్మాదం. అలాంటి వాడు శాడిస్ట్‌. వాడు లవర్‌ కాదు. లవ్‌ అనేది ఎప్పుడూ హింసాత్మకంగా వుండదు. హింసాత్మకంగా వుంటే అది ప్రేమే కాదు. అలా నా స్టయిల్‌లో చెప్పాలనుకున్నాను. ప్రేమ అలా మారిపోయింది. అలా కాదు ఇలా వుంటే బాగుంటుందని నా స్టయిల్‌లో చెబుతున్నాను. ఈ పాయింట్‌తో ఓ కథ చెప్పాలనుకున్నా.. ఈ సినిమాతో చెబుతున్నాను. ఇట్స్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. ఇది మేసేజ్‌లా వుండదు. ఎంటర్‌టైనింగ్‌ వుంటుంది. అండర్‌ కరెంట్‌తో ట్రూలవ్‌‌ను చూపించాలనుకున్నాను. (Director K Vijaya Bhaskar Interview)

ఈ కథను మీ తనయుడు శ్రీకమల్‌ కోసమే అనుకున్నారా?

ఈ కథ ఇంతకుముందే రెడీ చేసుకున్నాను. ఇద్దరు ముగ్గురికి చెప్పాను కూడా. ‘జిలేబి’ తరువాత నాకు సరిపోయే కథతో సినిమా చేయండి అని కమల్‌ అడిగాడు. ఇది కమల్‌ వయసుకు మ్యాచ్‌ అయ్యే కథ అనిపించింది. అందుకే కమల్‌తో ఈ సినిమా చేశాను.


కమల్‌ కెరీర్‌కు ఇది ఎలాంటి సినిమా అవుతుందని అనుకుంటున్నారు?

కమల్‌కు ఇదొక మంచి అవకాశం. ఇంతకు ముందు కమల్‌ చేసిన సినిమా ఓన్లీ ఎంటర్‌టైనింగ్‌ సినిమా. ఇది ఇంటెన్సిటీ ప్రేమకథ సినిమా. ఈ సినిమాతో తాన్వీ ఆకాంక్ష అనే తెలుగమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ఈ అమ్మాయిని ‘జై చిరంజీవ’ టైమ్‌లో బాలనటిగా రిజెక్ట్‌ చేశాను. వెరీ గుడ్‌ గర్ల్‌ వెల్‌ బిహేవ్‌. వాళ్లిద్దరితో పాటు నాకు కూడా ఈ సినిమా మంచి అవకాశం. యూత్‌ఫుల్‌ కథ. ‘మసాలా’ తర్వాత ‘నువ్వు నాకు నచ్చావ్‌’ జానర్‌లో వున్న సినిమా చేసిన ఫీల్‌ కలిగింది.

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఎంటర్‌టైన్‌మెంట్‌ను పండించడం టఫ్‌గా వుందని భావిస్తున్నారా?

కామెడీని రాసుకోవడం ఛాలెంజింగ్‌గా ఏమీ లేదు. కామెడీకి బౌండరీస్ ఏమీ లేవు. కొంత మంది సీరియస్‌గా వుంటూ కూడా నవ్విస్తారు. నా సినిమాలో వుండే కామెడీ అంతా నా స్ట్ర్కిప్ట్‌లోనే వుంటుంది. పాత్రలో వుంటుంది. ఎవరి కోసం కథ చేస్తామో.. వాళ్లను దృష్టిలో పెట్టుకుని కామెడీ రాస్తాం. ‘మన్మథుడు’ సినిమా మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)కి మ్యాచ్‌ అవ్వదు. ‘జై చిరంజీవ’ వెంకటేష్‌ (Venkatesh)కు సరిపోదు. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ వెంకటేష్‌ను తప్ప మరెవరినీ ఊహించుకోలేం. ఈ సినిమా కథ ఓ కుర్రాడి కోసం తయారు చేసిన కథ. కేవలం కొడుకు కోసం చేసిన కథ కాదు. వాడి వయసుకు తగ్గ కథ ఇది. కానీ సినిమా చేసిన తర్వాత కమల్‌‌కు ఈ సినిమా కరెక్ట్‌ అనిపించింది. (Director K Vijaya Bhaskar About Usha Parinayam)

మీ వారసుడు అంటే డైరెక్షన్ వైపు వెళ్తాడని అనుకుంటారు? కానీ హీరోగా చేయడానికి రీజన్‌?

కుర్రాళ్లకు దిగితే తప్ప లోతు తెలియదు. మొదట్లో దర్శకత్వం చేస్తానన్నాడు. లేదు, నీకు యాక్టింగ్‌ కరెక్ట్‌ అని నేను చెప్పాను. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లోనే దర్శకత్వం అంటే ఎంత కష్టమో.. అనేది కమల్‌కు అర్థమైంది. మనకు ఏది తెలియదో.. తెలుసుకోవడమే గొప్ప విజ్ఞానం అని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చెప్పినట్లు.. వయసు వచ్చిన తర్వాత తండ్రి చెప్పింది కరెక్ట్‌ అని రియలైజ్‌ అయ్యే టైమ్‌కు.. అతనికి నువ్వు చెప్పింది తప్పు అని చెప్పే కొడుకు వుంటాడు.


ప్రేక్షకుల అభిరుచి మారిందని టాక్ ఉంది కదా.. ఇప్పటి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందని అనుకుంటున్నారు?

ఆడియన్స్‌ టేస్ట్‌ మారింది అనే విషయాన్ని నేను ఒప్పుకోను. 100 ఏళ్లు అయిన ప్రేక్షకుల అభిరుచి మారదు. చక్కగా ఎంటర్‌టైన్‌ చేయగలిగితే.. ఆడియన్స్ చూస్తారు. ఎన్ని మారినా, ఎన్ని ఫ్లాట్‌ఫామ్స్ వచ్చినా.. కథలో అన్ని సమపాళ్లలో జోడిస్తే సినిమాలు తప్పకుండా చూస్తారు. థియేటర్‌కు వస్తారు

ఈ చిత్రంలోని పాటలను వింటుంటే.. ప్రత్యేకంగా పాటలపై శ్రద్ద పెట్టారనిపిస్తోంది..?

చాలా రోజుల తరువాత నాకు మనస్ఫూర్తిగా అన్ని మంచి పాటలు ఆడియన్స్‌కు ఇచ్చామనే ఫీలింగ్‌ ఈ సినిమాతో కలిగింది. ఆర్‌.ఆర్‌ ధ్రువన్‌ నా కథకు తగ్గట్టుగా చాలా మంచి సంగీతం ఇచ్చాడు. సంగీతం అనేది స్ట్ర్కిప్ట్‌లో వుండాలనేది నా ఫీలింగ్‌.

యూత్‌ఫుల్‌ ఆడియన్స్‌‌కేనా లేక ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఈ సినిమాను చూడొచ్చా..?

‘ఉషా ప‌రిణ‌యం’ సినిమా యూత్‌ఫుల్‌గా వుంటుంది.. కానీ మా టార్గెట్‌ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌. చాలా మంది ఈ మధ్య థియేటర్స్‌కు ఆడియన్స్‌ రావడం లేదని అంటున్నారు కానీ.. అసలు ఎందుకు రావడం లేదో ఎనలైజ్‌ చేసుకుంటే సినిమా అంటే అందరూ కలిసి కూర్చొని ఎంజాయ్‌ చేసేటట్టు వుండాలి. సినిమాలో అలాంటి ఎలిమెంట్స్‌ లేకుండా సినిమాలు తీస్తే ప్రేక్షకులు రారు. అందరూ కలిసి భోజనం చేసినట్టుగా.. అందరూ కలిసి కూర్చుని చూసే సినిమాలు వస్తే బాగుంటుంది. మంచి సినిమాలు చూస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఒక తరగతి ఆడియెన్స్ మాత్రమే శాటిస్‌ఫై అయ్యేలా సినిమా తీస్తే ఎలా? అనేది నా ఫీలింగ్‌. ఈ సినిమా తప్పకుండా అందరూ ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా వుంటుంది. (Usha Parinayam Ready to Release)

‘ఉషా పరిణయం’ టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి?

ఇదొక క్లాసిక్‌ టైటిల్‌.. నాకు ఎప్పట్నుంచో ఈ టైటిల్‌తో సినిమా చేయాలని కోరిక వుండేది. ఇన్నాళ్లకు కుదిరింది. ఇందులో హీరోయిన్‌ పేరు కూడా ఉషా. సినిమా అంతా ఆమె పెళ్లి గురించే. ఈ సినిమాలో ప్రేమ గురించి చెబుతున్నాను. ఈ సినిమాకు ‘లవ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ అనే క్యాప్షన్ ఎందుకు చెబుతున్నానో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు లవ్‌, ఎమోషన్ ఎంతో సున్నితంగా వుండేవి. ఇప్పుడు ఓటీటీల ప్రభావమో ఏంటో కానీ ప్రేమకథలో ఆ సున్నితత్వం పోయింది. ప్రేమ అనేది ఎంతో నోబుల్‌ ఎమోషన్‌. నేటి కథల్లో అది మిస్‌ అవుతుంది. ఇంటెన్సిటి ఎమోషన్‌. ఆ అమ్మాయి భావాలను శాసించే హక్కు ఎవరికి వుండదు. ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్‌‌గా చెబుతున్నాను. ప్రేక్షకులకు థియేటర్‌‌కు వచ్చి చూడాలనే ఫీలింగ్‌ను ప్రేక్షకులకు ఈ సినిమా కలిగిస్తుంది.

Updated Date - Jul 27 , 2024 | 05:06 PM