మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మునుపెన్నడూ.. ఎవరూ చూడని మైథలాజికల్ చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’

ABN, Publish Date - Feb 29 , 2024 | 04:27 PM

మునుపెన్నడూ చూడని అద్భుతమైన మైథలాజికల్ కంటెంట్ తో రూపొందిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. రేపు ప్రపంచవ్యాప్తంగాా విడుదల అవుతున్న సందర్భంగా హీరో శివ కందుకూరితో ప్రత్యేక ఇంటర్వ్యూ.

Bhoothaddam Bhaskar Narayana

శివ కందుకూరి (Shiva Kandukuri ) హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana) అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానున్న ఈ నేపథ్యంలో హీరో శివ కందుకూరి విలేకరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ విశేషాలని పంచుకున్నారు.

మీకు ఇది తొలి డిటెక్టివ్ సినిమా కదా..ఈ అనుభవం గురించి చెప్పండి ?

క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ తెలుగులో చాలా వచ్చాయి. డిటెక్టివ్ అనేసరికి చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి జోనర్ సినిమా చేయాలనుకున్నపుడు ఏదో యునిక్ నెస్ ఉంటే తప్పితే చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సినిమాలో భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విన్నాను. ఇందులో ఒక మైథాలజీ ఎలిమెంట్ ఉంది. మునుపెన్నడూ ఇలాంటి ఎలిమెంట్ ఏ డిటెక్టివ్ సినిమాలో లేదు. అది నాకు కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది.

మనం మన నిజ జీవితంలో చాలా సార్లు దిష్టి బొమ్మను చూస్తుంటాం. కానీ అసలు అది ఎందుకు ఉందనేది పెద్దగా పట్టించుకోము. దాని గురించి చాలా మందికి తెలీదు. దీని గురించి పురాణాల్లో ఒక కథను సినిమాకు దర్శకుడు అద్భుతంగా జోడించాడు. ఇందులో డిటెక్టివ్ పాత్ర కూడా చాలా అభిన్నంగా డిజైన్ చేశారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిటింగా అనిపించిందో సినిమా చూసినప్పుడు అది మరింతగా పెరిగింది. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామనే నమ్మకం వుంది.

డిటెక్టివ్ అంటే బ్లాక్ నడ బ్లాక్ చూపిస్తుంటారు.. ఇందులో మాత్రం పంచెకట్టు, లుంగీలో కనిపిస్తున్నారు ?

దర్శకుడు పురుషోత్తం రాజ్ ది అనంతపురం దగ్గర ఓ విలేజ్. అక్కడ ఉన్న పాత్రలని ఆయన పల్లె జీవనంలో చూసిన పాత్రల్లా డిజైన్ చేశారు. ఈ కథ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్య ఉండే ఫారెస్ట్ టౌన్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో డిటెక్టివ్ పాత్రని కూడా అక్కడ ఉన్న ఓ సహజ సిద్దమైన పాత్రలానే డిజైన్ చేశారు. దీంతో వరల్డ్ బిల్డింగ్ లో ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది.


ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం జరగడానికి కారణం ?

వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండే సినిమా ఇది, మేము మొదట ఎంచుకున్న వీఎఫ్ఎక్స్ టీం ఇచ్చిన అవుట్ పుట్ మాకు తృప్తిని ఇవ్వలేదు. దీంతో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా మరో కంపెనీతో మొదటి నుంచి చేయించారు. ఈ విషయంలో నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతున్నాను. సీజీ వర్క్ అద్భుతంగా వచ్చింది, ఈ కథ, సినిమాపై ఉన్న నమ్మకం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మైథాలజికల్ థ్రిల్లర్ జోనర్స్ ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా రావడం మంచి పరిణామం అనిపిస్తోంది. బిజినెస్ పరంగా కూడా నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక నటుడిగా ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని విడుదల చేస్తుండటం మాకు మరింత బలాన్ని ఇచ్చింది.

భూతద్ధం భాస్కర్ నారాయణ టైటిల్ పెట్టడానికి కారణం ?

ఇందులో నా పేరు భాస్కర్ నారాయణ. ఆ పాత్రకు భూతద్ధం సైజు కళ్ళద్దాలు ఉంటాయి. దీంతో అందరూ భూతద్ధం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana) అని పిలుస్తుంటారు. డిటెక్టివ్ అనేసరికి భూతద్ధంని వాడుతుంటాం. టైటిల్ కి పాత్రకు రెండికి ఆ టైటిల్ యాప్ట్ గా సరిపోయింది. ఇందులో ఫన్ ఎలిమెంట్, లవ్ ట్రాక్ కథలో భాగమయ్యే ఉంటుంది.

హీరోయిన్ రాశీ సింగ్ గురించి ?

ఇందులో కథానాయిక పాత్రకు తెలుగమ్మాయి అయితే బావుటుందని అనుకున్నాం. ఇలాంటి సమయంలో రాశి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. తనది తెలుగు కాకపోయినప్పటికీ తెలుగుని చాలా చక్కగా మాట్లాడగలదు. ప్రతి డైలాగ్ ని కష్టపడి నేర్చుకుని, చాలా అంకితభావంతో పని చేసింది.

శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం గురించి ?

శ్రీచరణ్ పాకాల థ్రిల్లర్స్ కి మ్యూజిక్ ఇవ్వడంలో దిట్ట. ఈ సినిమాకి ఆయన నేపథ్య సంగీతం చేయడం చాలా అనందంగా ఉంది. మాకు చాలా ప్లస్ అయ్యింది. అద్భుతమైన సౌండ్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ ని ఇస్తుంది. అలాగే ఇందులో ఏఐ జనరేటెడ్ లిరికల్ వీడియో చేశాం. అది మా ఆర్ట్ డైరెక్టర్ ఆలోచన. యాభై పెయింటింగ్ లు స్కాన్ చేసి ఎఐ లిరికల్ వీడియో చేశాం. తెలుగు చేసిన తొలి ఎఐ లిరికల్ వీడియో కావడం ఆనందంగా ఉంది.

మంచి పాత్ర కుదిరినప్పుడు ఇతర హీరోల సినిమాల్లో నటిస్తారా ?

మంచి కథ, పాత్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య సినిమాలో సెకండ్ లీడ్ గా చేశాను. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.

మీ ఫిల్మ్ జర్నీ ఎలా అనిపించింది ?

ఒక అప్ కమింగ్ యాక్టర్ ఎక్కడ ఫిట్ ఇన్ అవుతారో తెలుసుకోవాలంటే మనల్ని మనం ఎక్స్ ఫ్లోర్ చేసుకోవాలి. ఇప్పటివరకూ ప్రతి సినిమాతో ఓ కొత్త జోనర్ ని చేశాను. చూసి చూడంగానే రొమాంటిక్ ఫిలిం, గమనం సోషల్ డ్రామా, మనుచరిత్ర మాస్ టచ్ వున్న సినిమా. ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. సినిమా కథ, పాత్ర ప్రేక్షకులని హత్తుకోవాలంటే అందులోని ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించగలగాలని ఈ జర్నీలో నేర్చుకున్నాను.

మీకు ఎలాంటి జోనర్స్ ఇష్టం ?

క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టం. క్రైమ్ కామెడీ ని కూడా ఎంజాయ్ చేస్తాను. ఈ జోనర్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాను.

నాన్నగారు( రాజ్ కందుకూరి) ఈ సినిమా చూశారా ?

చూశారు. ఆయనకి చాలా నచ్చింది. చెప్పినదాని కంటే అద్భుతంగా తీశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. నాన్న గారితో కథలు గురించి చర్చిస్తాను. అయితే ఫైనల్ కాల్ మాత్రం నాదే.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?

ప్రమోద్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. ఓల్డ్ సిటీ నేపథ్యంలో జరిగే కథ అది. వినోదంతో పాటు మంచి భావోద్వేగాలు కూడా ఉంటాయి. మార్చి 4 నుంచి షూట్ కి వెళ్తున్నాం. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.

ఆల్ ది బెస్ట్, థాంక్ యూ

Updated Date - Feb 29 , 2024 | 05:28 PM