Malai: యోగిబాబు, లక్ష్మీమేనన్ జంట‌గా ‘మలై’

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:10 AM

ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు, నటి లక్ష్మీ మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మలై’ . వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది.

malai

‘బ్లూస్టార్‌’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లెమన్‌ లీఫ్ (Lemonleaf Creation) సంస్థ తాజాగా ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు (Yogi Babu), నటి లక్ష్మీ మేనన్ (Lakshmi Menon) ప్రధాన పాత్రల్లో ‘మలై’ (Malai) అనే చిత్రాన్ని తెరకెక్కించింది. వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది.

నూతన దర్శకుడు ఐపీ మురుగేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయగా, ఆర్‌.గణేశ్‌ మూర్తి (GANESH MURTHY), సౌందర్య గణేశ్ (Soundarya Ganeshmurthy) నిర్మించారు. ఇతర పాత్రల్లో కాళీ వెంకట్‌, బాలనటుడు చతుర్థి గణేశమూర్తి తదితరులు నటించారు.


ఈ సినిమా వివరాలను దర్శకుడు వివరిస్తూ, ‘మానవ జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మనుషుల వలే జంతువులు, మొక్కలు, పర్వతాలు, నదులు, నీటి వనరులు ఈ భూమిపై చాలా ముఖ్యమైనవి. మానవుల స్వార్థానికి ప్రకృతి నాశనం అయిపోతోంది. తాము చేసే దురాగతాల నుంచి తప్పించుకోవడానికి అధికారం, రాజకీయం, కులం, మతం, జాతి వంటి వాటిని అడ్డు పెట్టుకుంటున్నారు.

సాటి వారిపై ప్రేమ మరిచి, భవిష్యత్‌ తరాల జీవితాల గురించి ఏమాత్రం ఆలోచన లేని దురాశ ప్రకృతి వినాశనానికి దారితీస్తుంది. ఇలాంటి ఒక మంచి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన‌ట్లు తెలిపారు. ఈ మూవీకి డి.ఇమ్మాన్‌ సంగీతం అందించగా, త్వరలోనే పాటలను విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 11:10 AM