Yash - Toxic: టాక్సిక్‌ టైటిల్‌ వెనుక కారణమదే

ABN, Publish Date - Oct 24 , 2024 | 11:01 AM

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు టైటిల్‌ ఆయనే సూచించినట్లు చెప్పారు. అందుకు గల కారణాన్ని వివరించారు. యశ్‌ మాట్లాడుతూ ‘‘పరిశ్రమలో ఇప్పటివరకు పిల్లల కోసం చాలా సినిమాలు వచ్చాయి. కానీ మేము ఈ సినిమాతో పెద్దలకు సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.


'కేజీఎఫ్‌’ (KGF) సిరీస్‌ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు కన్నడ హీరో యశ్‌ (Yash). ప్రస్తుతం ఆయన మలయాళ దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ (Geethu mohan das) దర్శకత్వంలో ‘టాక్సిక్‌’ (toxic) చిత్రం చేస్తున్నారు.  ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌ లైన్‌. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభమైంది. యశ్‌ హీరోగా నటిస్తున్న 19వ చిత్రమిది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు టైటిల్‌ ఆయనే సూచించినట్లు చెప్పారు. అందుకు గల కారణాన్ని వివరించారు. యశ్‌ మాట్లాడుతూ ‘‘పరిశ్రమలో ఇప్పటివరకు పిల్లల కోసం చాలా సినిమాలు వచ్చాయి. కానీ మేము ఈ సినిమాతో పెద్దలకు సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టాం. ప్రస్తుతం మనలో చాలామంది గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం. ‘టాక్సిక్‌’ అనే పదాన్ని ఎన్నో సందర్భాల్లో వాడుతుంటాం. ఇప్పుడంతా విషపూరిత పరిస్థితుల్లో జీవిస్తున్నాం. అందుకే ఈ టైటిల్‌, ట్యాగ్‌లైన్‌ కథకు, సందర్భానుగుణంగా ఉంటుందనిపించింది. కథ వినగానే ఈ టైటిల్‌ సూచించా’’ అని యశ్‌ అన్నారు.



దర్శకురాలు గురించి చెబుతూ "ఆమెకు మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. గతంలో ఆమె ఎలాంటి సినిమాలు చేశారు.. వాటి రిజల్ట్‌ ఎలా ఉందనేది కాకుండా ఆమె ఏం కథ చెప్పాలనుకుంటున్నా అనేది మాత్రమే చూశాను. ఆమెకు సినిమా అంటే పిచ్చి. ఈ చిత్రంలో మహిళా పాత్రలు చాలానే ఉన్నాయి.  ఆ హీరోయిన్ల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ రెండు చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగా ఉన్నాయి.  బాలీవుడ్‌ నటి తారా సుతారియా ఈ చిత్రంలో నటిస్తుందనే వార్తలు రాగా, వాటిని దర్శకురాలు ఖండించారు.   ప్రస్తుతానికి సాయిపల్లవి, కరీనాకపూర్‌, శ్రుతిహాసన్‌, కియారా అడ్వాణీ పేర్లు పరిళీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Updated Date - Oct 24 , 2024 | 11:01 AM