మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijay Sethupathi: స్టార్‌ హీరోలపై సంచలన వ్యాఖ్యలు...

ABN, Publish Date - Jun 07 , 2024 | 04:00 PM

హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు తమిళ విలక్షణ నటుడు విజయ్‌(Vijay Sethupati) . తన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్టీస్టారర్‌ చిత్రాల గురించి మాట్లాడారు.


హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు తమిళ విలక్షణ నటుడు విజయ్‌(Vijay Sethupathi). తన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్టీస్టారర్‌ చిత్రాల గురించి మాట్లాడారు. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్‌లో స్టార్‌ హీరోల సినిమాల్లో నటించాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు విజయ్‌ సేతుపతి ఆసక్తికర సమాధానమిచ్చారు. దర్శకత్వంపై తనకు ఆసక్తి ఉన్నట్లు విజయ్‌ సేతుపతి వెల్లడించారు. ‘‘నేను అలాంటి మల్టీస్టారర్‌ చిత్రాలు చేసి విసిగిపోయాను. వాటి వల్ల నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మరో అగ్ర హీరోతో కలిసి  స్క్రీన్  పంచుకోవాల్సినప్పుడు మన పాత్ర ఎలాంటిదనే విషయం ముందే చెబుతారు. దానిలో మనం ఎంత బాగా నటించినా పేరు మాత్రం రాదు. ఆ స్టార్‌ హీరోతో సమానంగా శ్రమించినా ఎవరూ గుర్తించరు’’ అని అన్నారు. (Vijay sethupati comments on Stars)

విలన్‌ పాత్రల్లో కూడా నటించకూడదని నిర్ణయించుకున్నట్లు మరోసారి ఆయన స్పష్టం చేశారు. ‘విలన్‌, అతిథి పాత్రల్లోనూ నటించకూడదనుకుంటున్నా. గడిచిన ఏడాదిలో ఇలాంటి అవకాశాలు చాలానే వచ్చాయి. వాటిని తిరస్కరించాను. నాకు రొమాంటిక్‌ సినిమాలు చేయడమంటే ఇష్టం. మంచి లవ్‌ స్టోరీ కోసం వెతుకుతున్నా. అటువంటి కథతో త్వరలోనే మీ ముందుకు వస్తా’ అని అన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 50వ సినిమా ‘మహారాజ’ విడుదలకు సిద్థమైంది. నిథిలన్‌ దర్శకత్వం వహిస్తుండగా అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి, మమత.. కీలక పాత్రలు  పోషిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jun 07 , 2024 | 06:10 PM