Vijay Sethupathi: బ్యానర్లు కడితే ప్రేక్షకులు వస్తారా? అని కామెంట్స్ చేశారు
ABN, Publish Date - Jun 21 , 2024 | 07:31 PM
తాను నటించిన పలు చిత్రాలు వరుసగా ఫెయిల్ కావడంతో ‘మహారాజ’ చిత్రానికి బ్యానర్లు కట్టినంత మాత్రాన ప్రేక్షకులు వస్తారా? అంటూ పలువురు కామెంట్స్ చేశారని, కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఘనవిజయం అందించారని విజయ్ సేతుపతి అన్నారు. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానరుతో కలిసి ‘ది రూట్’ కంపెనీ నిర్మించిన చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలై, ప్రేక్షకుల నుంచి భారీ స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.
తాను నటించిన పలు చిత్రాలు వరుసగా ఫెయిల్ కావడంతో ‘మహారాజ’ (Maharaja) చిత్రానికి బ్యానర్లు కట్టినంత మాత్రాన ప్రేక్షకులు వస్తారా? అంటూ పలువురు కామెంట్స్ చేశారని, కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఘనవిజయం అందించారని విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అన్నారు. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానరుతో కలిసి ‘ది రూట్’ కంపెనీ నిర్మించిన చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలై, మొదటి ఆట నుంచే అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీ స్పందనతో ప్రదర్శితమవుతోంది. వసూళ్ళపరంగా కూడా నిర్మాతలకు, పంపిణీదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో చిత్ర బృందం థ్యాంక్స్ గివింగ్ మీట్ (Maharaja Thanks Giving Meet) ఏర్పాటు చేసింది.
Also Read- Konidela Nagababu: పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది..!
ఇందులో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వినిపించేటపుడు మంచి నమ్మకం కలిగింది. కానీ, ఇది ఎలా కార్యరూపం దాల్చుతుందన్న ప్రశ్నకూడా వచ్చింది. ఈ సినిమా కోసం నిర్మాత పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా చేయాలన్న పట్టుదలతో పనిచేశాం. నేను నటించిన పలు చిత్రాలు వరసగా నిరాశపరిచాయి. ఇపుడు ‘మహారాజ’కు బ్యానర్లు కడితే విజయ్ సేతుపతి చిత్రానికి ప్రేక్షకులు వస్తారా? అనే కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి వాటికన్నింటికీ ఈ చిత్రం సక్సెస్ సమాధానం చెప్పింది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
దర్శకుడు నితిలన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రశంసిస్తూ ఫోన్లు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్ళిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. నటి మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఓ పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు. విజయ్ సేతుపతి 50వ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మలయాళంలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇటీవల కాలంలో నేను నటించిన చిత్రాలు ఈ స్థాయిలో ఏదీ ఆదరణకు నోచుకోలేదు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. అలాగే, చిత్ర నిర్మాతలు సుధన్, కమల్ నయన్, శ్రీనివాసన్, నటులు మణికంఠన్, అరుళ్‌దాస్, వినోద్ తదితరులు ప్రసంగించారు.
Read Latest Cinema News