విజయ్‌ ఆదిరాజ్‌ దర్శకత్వంలో ‘నొడిక్కు నొడి’

ABN, Publish Date - Jul 16 , 2024 | 08:32 PM

విజయ్‌ ఆదిరాజ్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రానికి ‘నొడుక్కి నొడి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమంతో ఇటీవ‌లే ప్రారంభమైంది.

Nodikku Nodi

విజయ్‌ ఆదిరాజ్ (vijay adiraj) దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రానికి ‘నొడుక్కి నొడి’ (Nodikku Nodi)అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమంతో ఇటీవ‌లే ప్రారంభమైంది. నాక్స్‌ స్టూడియోస్ (Nox Studios) పతాకంపై నిర్మాత ఆరోగ్యదాస్‌ తెరకెక్కే ఈ చిత్రంలో అశ్విన్‌ కుమార్ (Ashwin Kumar), శ్యామ్‌, నరేన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

బుల్లితెర నటుడిగా, ఆర్జేగా రాణిస్తున్న విజయ్‌ ఆదిరాజ్‌.. ‘పుత్తగం’ అనే త్రం ద్వారా కోలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయమయ్యారు. అనేక కమర్షియల్‌ యాడ్స్‌ రూపొందించిన అనుభవంతో ‘నొడుక్కి నొడి’ పేరుతో తన తదుపరి ప్రాజెక్టు ప్రారంభించారు.


ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ, ‘ఉత్కంఠభరితంగా సాగే స్క్రీన్‌ ప్లేతో ఒక సినిమా రూపొందించాలన్నదే నా కల. ఆ బాణీలోనే ఈ సినిమా ఉంటుంది. అమ్రేష్‌ సంగీతం అందిస్తున్నారు. నమ్రిత (Namritha MV), అభిరామి, మేఘా రాజన్‌ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 16 , 2024 | 08:32 PM