Vignesh Shivan: నువ్వు లేకపోతే నేను లేను మీనాకుమారి!
ABN, Publish Date - Jul 29 , 2024 | 05:04 PM
తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందాకే పేరెంట్స్ విలువ బాగా అర్థమవుతోంది అంటున్నారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan). శనివారం విఘ్నేశ్ తల్లి పుట్టినరోజు.
తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందాకే పేరెంట్స్ విలువ బాగా అర్థమవుతోంది అంటున్నారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan). శనివారం విఘ్నేశ్ తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా తల్లితో దిగిన ఫోటో షేర్ చేసిన విఘ్నేష్ "నేను నా పిలల్ని చూసిన ప్రతిసారి నాలో పొంగే ప్రేమను మాటల్లో వర్ణించలేను. ఎన్ని ఏళ్ల్లు దాటినా ఈ ప్రేమ ఇలాగే ఉంటుందని అర్థమైంది. తల్లిదండ్రులు కూడా మన విషయంలో ప్రతిరోజు ఇలాగే ఫీల్ అవుతారు కదా! పిల్లల్ని వారికి నచ్చినట్లుగా సంతోషంగా ఉండనిద్దామనుకుంటారు. హ్యాపీ బర్త్డే నా మీనా కుమారి. నువ్వు లేకపోతే నేను ఇంతదూరం వచ్చేవాడినే కాదు. లవ్యూ మమ్మీ. ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.(Nayanatara)
నాకింత మంచి కుటుంబాన్ని, ఎన్నో జ్ఞాపకాలు అందించిన ఆ దేవుడు చాలా మంచివాడు. ఆయన ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయమ్మా.. అని రాసుకొచ్చాడు. అంతే కాదు తన బిడ్డలు ఇద్దరితో కలిసి దిగిన ఫొటోలతో పాటు తన మాతృమూర్తితో దిగిన ఫొటోలను షేర్ చేయగా ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయు.విఘ్నేశ్ ప్రస్తుతం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.