మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Varalaxmi Sarathkumar: సెలబ్రిటీల లోపాలే కాదు.. వేల సమస్యలున్నాయ్‌!

ABN, Publish Date - Mar 14 , 2024 | 08:43 PM

డ్రగ్స్‌ కేసులో తమిళ  నటి వరలక్ష్మీ శరతకుమార్‌ (Varalaxmi Sarathkumar) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ రెండ్రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే!

డ్రగ్స్‌ కేసులో తమిళ  నటి వరలక్ష్మీ శరతకుమార్‌ (Varalaxmi Sarathkumar) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ రెండ్రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! ఎన్‌ఐఏ పోలీసులు ఆమెను అరెస్ట్‌(Drugs case) చేశారని ప్రచారం జరిగింది. దీనిపై వరలక్ష్మి తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై అసత్య కథనాలు ప్రచురించిన పలు మీడియా సంస్థలపై మండిపడుతూ ఎక్స్‌లో(ట్విటర్‌) పోస్ట్‌ పెట్టారు.


‘‘మంచి వార్తలు లేకపోవడంతో పలు మీడియా సంస్థలు, నిరాధారమైన పాత వార్తలు ప్రసారం చేయడం నిజంగా బాధాకరం. పలువురు జర్నలిస్ట్‌లు, స్వయం ప్రకటిత వెబ్‌సైట్స్‌కు నేను చెప్పేది ఒక్కటే. అసలైన జర్నలిజాన్ని మీరెందుకు ప్రారంభించకూడదు. సెలబ్రిటీలలోని లోపాలను వెతకడం ఇకనైనా మానండి. విభిన్న కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడానికి మేం శ్రమిస్తున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. మరి, మీ పని మీరు ఎందుకు చేయడం లేదు. సమాజంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలు వేలకొద్దీ ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. మా మౌనాన్ని బలహీనతగా భావించకండి. పరువు నష్టం కేసులు కూడా ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతున్నాయి. కాబట్టి, ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మానండి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.



ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఐఏ అధికారులు వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారంటూ గతంలోనూ వార్తలు వచ్చాయి. దీనిపై ఓ మీడియా సమావేశంలో ఆమె స్పందించారు. ‘‘డ్రగ్స్‌ కేసుకు నాకూ ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎలాంటి సమన్లు, లేదా ఫోన్‌ కాల్స్‌ రాలేదు. గతంలో  నా దగ్గర ఆదిలింగం అనే వ్యక్తి ఫ్రీలాన్స్‌ మేనేజర్‌గా పని చేశారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు ఏమీ తెలియదు. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఆయన పేరుతో వార్తలు వచ్చాయి. దానికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో నా ఫొటోని ఉపయోగించి ‘వరలక్ష్మి మేనేజర్‌కు నోటీసులు’ అని వార్తలు ప్రసారం చేస్తున్నారు. అంతే తప్ప ఆ కేసుతో నాకెలాంటి సంబంధం  లేదు’’ అని అప్పట్లో స్పష్టతనిచ్చారు.

Updated Date - Mar 14 , 2024 | 08:43 PM