Mambo: వ‌నిత కుమారుడు హీరోగా.. నిజ‌మైన సింహంతో సినిమా!

ABN, Publish Date - Jul 28 , 2024 | 12:51 PM

సీనియర్‌ నటుడు విజయకుమార్‌ ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసుడు కోలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమవుతున్నాడు. పేరు విజయ్‌ శ్రీహరి . ప్రముఖ దర్శకుడు ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాంబో’ చిత్రంలో అతడు హీరోగా నటిస్తున్నాడు.

mambo

సీనియర్‌ నటుడు విజయకుమార్‌ ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసుడు కోలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమవుతున్నాడు. పేరు విజయ్‌ శ్రీహరి (vijay srihari). ప్రముఖ దర్శకుడు ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాంబో’ చిత్రంలో అతడు హీరోగా నటిస్తున్నారు. వెటరన్‌ నిర్మాత ఎం.ఖాజామొహిదీన్‌ రోజా కంబైన్స్‌ పతాకంపై చాలా గ్యాప్‌ తర్వాత ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్‌ వెల్లడి, హీరో పరిచయ కార్యక్రమం గురువారం నగరంలో జరిగింది. ఇందులో చిత్ర పరిశ్రమ నుంచి నిర్మాతలు టి.శివ, డి.ధనుంజయన్‌ వంటి అనేక మంది ప్రముఖులు హాజరై యువ నటుడిని అభినందించారు. అలాగే, సుధీర్ఘ కాలం తర్వాత మళ్ళీ సినిమాలు తీసేందుకు వచ్చిన నిర్మాత ఖాజామొహిదీన్‌ను ఇతర నిర్మాతలు ప్రత్యేకంగా అభినందించారు.


దర్శకుడు మాట్లాడుతూ, ‘షూటింగ్‌ శరవేగంగా జరుపుకునే ఈ సినిమాను ‘జర్నీ ఆఫ్‌ ఏ వైల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌’గా రూపొందిస్తున్నాం. ఇందుకోసం రియల్‌ సింహంతో హీరో ట్రైనింగ్‌ తీసుకుని సన్నివేశాల్లో నటిస్తున్నారని వివరించారు.

కాగా, విజయకుమార్‌ ఫ్యామిలీ నుంచి ఆయన కుమారుడు అరుణ్‌ విజయ్‌ హీరోగా రాణిస్తున్నారు. ఇపుడు మూడోతరం వారసుడిగా, వనిత - ఆకా్‌షల సంతానమైన విజయ్‌ శ్రీహరి... విదేశాల్లో నటన, దర్శకత్వం, ప్రొడక్షన్‌ విభాగాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి స్వదేశానికి వచ్చి... నటనపై దృష్టిసారించి, తన తొలి చిత్రంలోనే ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో నటించడం గమనార్హం.

Updated Date - Jul 28 , 2024 | 01:03 PM