Sri Gowri Priya: ‘ట్రూ లవర్’.. ప్రేమికుల జీవితాలను రిఫ్లెక్ట్ చేస్తుంది
ABN, Publish Date - Feb 07 , 2024 | 04:15 PM
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ట్రూ లవర్. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ సినిమాలోని హైలైట్స్ గురించి మీడియాతో పంచుకుంది.
మణికందన్ (Manikandan), శ్రీ గౌరి ప్రియ (Gowri Priya), కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ట్రూ లవర్ (True Lover). ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ సినిమాలోని హైలైట్స్ గురించి మీడియాతో పంచుకుంది.
నేను హైదరాబాద్ అమ్మాయిని. చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్, కాలేజ్ ఈవెంట్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాను. మ్యూజిక్ నేర్చుకున్నా. పాటలు పాడతా, 2018లో మిస్ హైదరాబాద్ గా సెలెక్ట్ అయిన తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ మొదలయ్యాయి. ఆర్ట్ అంటే ఇష్టం ఉన్నా.. హీరోయిన్ అయ్యింది మాత్రం యాక్సిడెంటల్ గానే. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనే డ్రీమ్స్ లేవు. వైజయంతీ మూవీస్ లో ప్రియదర్శితో కలిసి మెయిల్ వెబ్ సిరీస్ చేశాను. ఆ సిరీస్ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఆ తర్వాత సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్, సితార సంస్థలో మ్యాడ్ సినిమాల్లో నటించాను. ఇదంతా లాక్ డౌన్ టైమ్ లో జరిగింది కాబట్టి నేను చేసిన సినిమాలన్నీ లాస్ట్ ఇయర్ రిలీజ్ కు వచ్చాయి. ఈ మూవీస్ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత మోడరన్ లవ్ చెన్నై వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చింది. ఈ సిరీస్ తో తమిళ ఆడియెన్స్ కు దగ్గరయ్యాను. మోడరన్ లవ్ చెన్నై భారతీరాజా, బాలాజీ శక్తివేల్, త్యాగరాజ కుమారరాజ వంటి ఏడుగురు డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. మోడరన్ లవ్ చెన్నైలో నా నటన చూసి ట్రూ లవర్ సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. తమిళంలో ఈ సినిమా లవర్ పేరుతో తెరకెక్కించారు. అక్కడ 9న రిలీజ్ అవుతోంది. తెలుగులో 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
- "ట్రూ లవర్" సినిమాలో దివ్య అనే క్యారెక్టర్ లో నటించాను. సెట్స్ లోకి వెళ్లే ముందు వర్క్ షాప్స్ చేశాం. నేను తమిళంలో డబ్బింగ్ చెప్పాను. అందుకు మా టీమ్ ఎంతో హెల్ప్ చేశారు. నేను మణికందన్ ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. మా అభిప్రాయాలు ఏంటనేవి షేర్ చేసుకున్నాం. ఈ కథలో మా క్యారెక్టర్స్ చేయాలంటే ఇలా కనీసం ఒకరి గురించి మరొకరికి తెలియాలని దర్శకుడు చెప్పారు. ఈ క్యారెక్టర్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ తీసుకున్నా. దివ్య క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ పరిధి మేరకే నటించేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎందుకంటే దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ దివ్య క్యారెక్టర్ ను అంత యూనిక్ గా స్క్రిప్ట్ చేశారు. మణికందన్ తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఆయన టాలెంటెడ్ పర్సన్. సెట్ లో ఎంతో కోపరేటివ్ గా ఉండేవారు.
"ట్రూ లవర్" సినిమాను తెలుగులో ఎస్ కేఎన్, మారుతి గారు రిలీజ్ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. వాళ్లు రిలీజ్ చేస్తే తెలుగు ఆడియెన్స్ కు బాగా రీచవుతుంది. ఒక తెలుగు అమ్మాయిగా నా సినిమాను మన తెలుగు ప్రేక్షకులు చూడాలని కోరుకోవడం సహజమే కదా. రిలీజ్ టైమ్ లో ఇక్కడ నేను లేకపోవడం బాధగా ఉంది. అయితే తప్పకుండా వచ్చి థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా. తమిళంలో ప్రీమియర్స్ వల్ల చెన్నైలో ఉండిపోవాల్సివచ్చింది.తెలుగు అమ్మాయిగా తమిళ మూవీస్ చేయడం టాలీవుడ్ కు దూరమైనట్లు భావించడం లేదు. తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. "ట్రూ లవర్" రిలీజ్ అయ్యాక వాటి వివరాలు చెబుతాను.
తమిళ, తెలుగు సినిమా పరిశ్రమలు కొన్ని దశాబ్దాలుగా ఒక్కటిగా సాగుతున్నాయి. ఎంతోమంది తమిళ హీరోలు తెలుగులోనూ పేరు తెచ్చుకున్నారు. తమిళ సినిమా తమిళంలో కంటే తెలుగులో పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో నా వరకు తమిళం, తెలుగు అనే బేధం చూడటం లేదు. ఫిల్మ్ మేకింగ్ రెండు చోట్లా ఒక్కటే. మొదట్లో భాష ఇబ్బంది అయ్యేది కానీ ఇప్పుడు బాగా తమిళ్ నేర్చుకున్నా. కంటెంట్ అనేది ఇప్పుడు కీలకం అయ్యింది. కథ బాగున్న సినిమాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఓటీటీలు వచ్చేశాక వరల్డ్ కంటెంట్ అంతా మనం ఇష్టంగా చూస్తున్నాం. సో అలాంటి మంచి కంటెంట్ "ట్రూ లవర్"లో ఉంది కాబట్టే ఈ సినిమా సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం.