‘అమరన్‌’కు పన్ను మినహాయింపు ఇవ్వాలి

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:10 PM

శివకార్తికేయన్ హీరోగా అగ్రనటుడు కమల్‌ హాసన్ నిర్మించిన ‘అమరన్‌’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై కోరారు.

amaran

రాజ్‌కుమార్‌ పెరియస్వామి (Rajkumar Periasamy) దర్శకత్వలో శివకార్తికేయన్ (Siva karthikeyan) హీరోగా అగ్రనటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) నిర్మించి రిలీజ్‌ చేసిన ‘అమరన్‌’ (Amaran) చిత్రాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని టీఎన్‌సీసీ (tncc) అధ్యక్షుడు సెల్వపెరుందగై (K. Selvaperunthagai) కోరారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

‘అమరన్‌’ (Amaran) చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షిచే అరుదైన అవకాశం నాకు లభించింది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎనలేని ఆనందం, సంతృప్తి కలిగింది. కశ్మీర్‌ సరిహద్దుల్లో భారత సైన్యం ఎలా పనిచేస్తుంది, అక్కడ ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళు, ఉగ్రవాదం వల్ల కశ్మీర్‌ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా అనేక విషయాలను సినిమాలో ఎంతో వాస్తవికంగా చూపించారు. ఇలాంటి సినిమా నిర్మించడం అంత తేలికైన పనికాదు. హీరో శివకార్తికేయన్‌కు ఇది జీవితంలో మరిచిపోలేని పాత్ర.

తమిళ చిత్రపరిశ్రమలో చిరకాలం గుర్తిండిపోయే మూవీ. మేజర్‌ ముకుంద్‌ భార్య పాత్రలో నటించిన సాయిపల్లవి (Sai Pallavi) ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిపోతారు. ఆమె పాత్రలో జీవించారు. నేటి యువతరం ఈ చిత్రాన్ని తప్పక చూడాలి. అలాగే ఈ సినిమాకు ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయించేలా ముఖ్యమంత్రి స్టాలిన్‌ చర్యలు తీసుకోవాలి. అదేసమయంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు విద్యాశాఖ ఈ సినిమా చూపించి, వారిలో దేశభక్తిని పెంపొందించేలా కృషి చేయాలి’ అని కోరారు.

Updated Date - Nov 08 , 2024 | 12:10 PM