ముగిసిన ‘కార్నర్‌ సీట్స్‌’ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

ABN, Publish Date - Sep 02 , 2024 | 06:59 PM

వి ఎంటర్‌టైన్మెంట్స్‌, భారత్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌, షార్ట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సంయుక్తంగా రెండు రోజుల పాటు ‘కార్నర్‌ సీట్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2024’ చిత్రోత్సవాలు శ‌నివారంతో ముగిశాయి.

the corner seats

వి ఎంటర్‌టైన్మెంట్స్‌, భారత్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌, షార్ట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సంయుక్తంగా రెండు రోజుల పాటు ‘కార్నర్‌ సీట్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2024’ (The Corner Seats International Film Festival) పేరుతో నిర్వహించిన చిత్రోత్సవాలు శ‌నివారంతో ముగిశాయి. గత నెల 30, 31వ తేదీల్లో తాంబరంలోని భారత్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ కాలేజీ కేంద్రంగా నిర్వహించారు.

యూనివర్సిటీ నిర్వాహకులు డాక్టర్‌ జగద్రక్షకన్‌, డాక్టర్‌ శ్వేత సందీప్‌ ఆనంద్‌, డాక్టర్‌ సందీప్‌ ఆనంద్‌ ఈ వేడుకలను ప్రారంభించగా, మొత్తం 242కు పైగా దేశాల నుంచి ఎంపిక చేసిన చిత్రాలను విద్యార్థులకు చూపించడమేకాకుండా ప్రపంచ సినిమా విస్తృతిని వారికి వివరించే ప్రయత్నం చేశారు.

ఇందులో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, ఆంగ్లంతో పాటు ఇతర భారతీయ భాషా చిత్రాలు, వివిధ అంతర్జాతీయ భాషల చిత్రాలను ప్రదర్శించి, వాటిలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ధరణి రాజేంద్రన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ మూర్తి, ఎడిటర్‌ సెల్వ, నటుడు అన్బుడన్‌ అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు. వి ఎంటర్‌టైన్మెంట్స్‌ విజయ్‌, శబరీనాథన్‌లు ముగింపు పలుకులు పలికారు.

Updated Date - Sep 02 , 2024 | 08:08 PM