Thangalaan: జీరో కట్స్‌తో సెన్సార్‌ పూర్తి

ABN, Publish Date - Jul 30 , 2024 | 07:42 PM

చియాన్ విక్రమ్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘తంగలాన్‌’. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పా.రంజిత్‌ దర్శకత్వంలో వైవిధ్యమైన కథతో ఇది తెరకెక్కింది.

చియాన్ విక్రమ్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘తంగలాన్‌’. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పా.రంజిత్‌ దర్శకత్వంలో వైవిధ్యమైన కథతో ఇది తెరకెక్కింది. సెన్సార్‌ పనులు పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. ఎలాంటి కట్స్‌ లేకుండా సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్స్‌గా ఈ చిత్రం రన్ టైమ్‌ ఉంది. ట్రైలర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంలో విక్రమ్‌ ఎలా ఉంటారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సహా నటీనటులందరూ డీ గ్లామరైజ్డ్‌గా కనిపించనున్నారు. చిత్రంలో కథానాయికగా కనిపించనున్న మాళవిక మోహనన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "దీనికోసం నేను 5 గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది.. స్కిన్‌ స్పెషలిస్ట్‌ దగ్గర నుంచి కంటి డాక్టర్‌ వరకు ఐదుగురు వైద్యులను కలిశాను. ఒక్కోరోజు దాదాపు 10 గంటలపాటు కెమికల్స్‌తో చేసిన మేకప్‌ శరీరంపై ఉండేసరికి ఎలర్జీ వచ్చింధీ" అన్నారు.

విక్రమ్‌ మాట్లాడుతూ 'ఇప్పటిదాకా ఏ సినిమాకు ఇంత కష్టం పడలేదు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరో ప్రపంచం లోకి వెళ్తారు’’ అని అన్నారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా ఇది రూపొందింది. త్వరలోనే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిరహించనున్నారు. ఆగస్ట్‌ 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే! 

Updated Date - Jul 30 , 2024 | 10:07 PM