The Goat: త‌మిళ‌నాట ‘ది గోట్‌’ .. కలెక్షన్ల సునామీ

ABN, Publish Date - Sep 13 , 2024 | 07:07 AM

ఇళయ దళపతి విజయ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ త‌మిళ‌నాట‌ వసూళ్ళ దుమ్మురేపుతోంది. తెలుగు, క‌న్న‌డ‌,హిందీ భాష‌ల్లో త‌ప్పితే త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో, ఓవ‌ర్సీస్‌లో సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

goat

వెంకట్‌ ప్రభు (Venkat prabhu) దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్‌ (Vijay) హీరోగా నటించిన చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time) విజయ్‌ డ్యూయెల్‌ రోల్‌ చేశారు. ఈ చిత్రం విడుద‌ల‌కు ముందేపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా రాజకీయ రంగ ప్రవేశానికి ముందు హీరో విజయ్‌ ఈ చిత్రం రావడం అభిమానుల్లో మరింత క్రేజ్‌ క్రియేట్‌ అయింది.

అయితే ‘ది గోట్’ చిత్రం వసూళ్ళ పరంగా దుమ్మురేపుతోంది. తెలుగు, క‌న్న‌డ‌,హిందీ భాష‌ల్లో త‌ప్పితే త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో, ఓవ‌ర్సీస్‌లో సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన మొద‌టివారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.335 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో తొలి రోజునే రూ.126.32 కోట్లు వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ 6 రోజుల్లో రూ.209 కోట్ల మేరకు కలెక్షన్లు సాధించినట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ 7వ రోజున 13 కోట్ల రూపాయలు రాబట్టింది.


తమిళంలో తొలివారమే సుమారు రూ. 150 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తెలుగులో మొద‌టి నుంచి అంతంత‌మాత్రంగానే వ‌సూళ్లూ రాబ‌డుతోంది. తెలుగులో 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మొదలు పెట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం రూ.10 నుంచి రూ.11 కోట్ల నికర వసూళ్లు మాత్ర‌మే రాబట్టి డిజాస్ట‌ర్ లిస్టులో చేరింది. అయితే ఈ మూవీ హిందీలో ఊహించని కలెక్షన్లు సాధించింది. ఇప్ప‌టివ‌ర‌కు రూ.11 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఏసీఎస్‌ సంస్థ ఈ మూవీని నిర్మించగా విజయ్‌, ప్రభుదేవా, ప్రశాంత్‌, కార్తీక్‌, స్నేహ, మీనాక్షి చౌదరి ఇలా అనేక మంది నటించారు. ఈ నెల 5వ తేదీ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా రిలీజైంది. ఇదిలావుంటే, ఈ సినిమాను ఓటీటీలో మూడున్నర గంటల నిడివితో విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే, ఓటీటీలో రిలీజ్‌ చేసే తేదీ మాత్రం వెల్లడించలేదు.

Updated Date - Sep 13 , 2024 | 07:07 AM