Dude: 'పునీత్ రాజ్ కుమార్'కి ప్రేమతో.. ఈ సినిమా అంకితం

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:02 AM

దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ అంకితమిస్తూ ఒక వినూత్న త్రిభాషా చిత్రం తెరకెక్కుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న వినూత్న త్రిభాషా చిత్రం 'డ్యూడ్'. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ 'పునీత్ రాజ్ కుమార్'కు అంకితం చేస్తుండడం విశేషం. రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్‌గా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ -2025 విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏక కాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్... ఈ చిత్రానికి 'స్క్రిప్ట్ కన్సల్టెంట్'గా కూడా వ్యవహరిస్తుడడం విశేషం. "శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష" వివిధ రంగాలకు చెందిన ఫుట్ బాల్ అంటే ప్రేమికులు ఈ సినిమాలో నటించనుండటం విశేష. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.


పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జింకే మారి' ఫేమ్ మహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా.. 'అలా మొదలైంది' ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2024 | 11:02 AM