Quotation Gang: ఈ సినిమాతో.. సన్నీ లియోన్‌పై అభిప్రాయం మారుతుంది

ABN, Publish Date - Jun 30 , 2024 | 11:21 AM

జాకీ ష్రాఫ్ , సన్నీలియోన్, ప్రియమణి నటించిన తాజా చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ ఈ సినిమాను జులైలో విడుదల కానుంది.ఈ క్ర‌మంలో ఇటీవ‌ల సినిమా ఆడియోను, ట్రైలర్‌ను విడుద‌దల చేశారు.

Quotation Gang

బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్ (Jackie Shroff), సన్నీలియోన్ (Sunny Leone), ప్రియమణి (Priyamani) నటించిన తాజా చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’(Quotation Gang). వివేక్‌ కుమార్‌ కన్నన్ (Vivek kumar knan) దర్శకుడు. ఫిల్మినాటి ఎంటర్‌టైన్మెంట్ (Filminati Entertainment) పతాకంపై నిర్మించిన ఈ సినిమాను జులైలో విడుదల చేయనున్నారు. దీన్ని పురస్కరించుకుని ఇటీవ‌ల ఆ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా హీరోయిన్‌ సన్నీ లియోన్‌ (Sunny Leone) మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పలు యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చూశాక నా పట్ల మీలో ఉన్న అభిప్రాయం మారుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అన్నారు.

హీరోయిన్‌ ప్రియమణి (Priyamani) మాట్లాడుతూ.. ‘నా సినీ కెరీర్‌లో ఇప్పటివరకు కాంట్రాక్ట్‌ కిల్లర్‌ పాత్రను పోషించలేదు. దర్శకుడు వివేక్‌ రూపొందించిన శకుంతల పాత్రను బాగా చేశానని భావిస్తున్నా. ఇప్ప‌టివ‌ర‌కు సన్నీ లియోన్ (Sunny Leone) గురించి వేరే అభిప్రాయం మీలో ఉండొచ్చు. కానీ, ఈ సినిమాలో పద్మ పాత్ర ఆమె పట్ల మీకున్న అభిప్రాయాన్ని మారుస్తుంది’ అన్నారు.


నిర్మాత గాయత్రి సురేష్ (Gayathri Reddy) మాట్లాడుతూ.. ‘ఈ ‘కొటేషన్‌ గ్యాంగ్‌’(Quotation Gang) సినిమాకు నిర్మాతగా అవకాశం ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు. సాధారణంగా మల్టీస్టారర్‌ చిత్రాలంటే అనేక సమస్యలు ఉంటాయి. కానీ, ఒక్క సమస్య కూడా లేకుండా సాఫీగా షూటింగ్‌ పూర్తి చేయడం సంతోషంగా ఉంది’ అన్నారు.

దర్శకుడు వివేక్‌ కన్నన్ (Vivek kumar knan) మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ప్రియమణి (Priyamani)తో ప్రారంభించా. ఆ తర్వాత జాకీ ష్రాఫ్ (Jackie Shroff), సన్నీ లియోన్ (Sunny Leone) వచ్చి చేరారు. కశ్మీర్‌లో చిత్రీకరణ అంటే అంత సులభం కాదు. థియేటర్‌లో బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ (Quotation Gang) మూవీ ఇస్తుంది.

వచ్చే నెలలో విడుదల చేసేలా ప్లాన్‌ చేశాం’ అని పేర్కొన్నారు. అలాగే, సహ నిర్మాత వివేకానందన్‌, నటులు ప్రదీప్‌, అశోక్‌, గేయరచయిత అరుణ్‌ భారతి, నటి అక్షయ, కెమెరామెన్‌ అరుణ్‌ పద్మనాభన్‌, ఎడిటర్‌ వెంకట్రామన్‌ తదితరులు ప్రసంగించారు.

Updated Date - Jun 30 , 2024 | 11:21 AM