Diwali: దీపావళి విజేత ఎవరో? నేడు మూడు చిత్రాలు విడుదల

ABN, Publish Date - Oct 31 , 2024 | 08:36 AM

దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం మూడు చిత్రాలు విడుదలకానున్నాయి. వీటిలో ఒకటి శివకార్తికేయన్‌ - సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్‌’ కాగా, మరో రెండు చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. మరి ఈ మూడింటిలో దీపావళి విన్నర్ ఎవరవుతారో చూడాల్సి ఉంది.

Amaran Movie Still

దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం మూడు చిత్రాలు విడుదలకానున్నాయి. వీటిలో ఒకటి శివకార్తికేయన్‌ - సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్‌’, జయం రవి - ప్రియాంకా మోహన్‌ కలిసి నటించిన ‘బ్రదర్‌’, యువ హీరో కవిన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘బ్లడీ బెగ్గర్‌’ మూవీలున్నాయి. గత యేడాది కార్తీ నటించిన ‘జపాన్‌’.. రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య నటించిన ‘జిగర్‌తండా డబుల్‌ ఎక్స్‌’ చిత్రాలు వచ్చాయి. ఏ ఒక్క పెద్ద హీరో చిత్రం విడుదలకాలేదు. ఈ యేడాది కూడా అదేపరిస్థితి నెలకొంది. అగ్రహీరోలు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, విజయ్‌, అజిత్‌ కుమార్‌, ధనుష్‌, సూర్య, కార్తీ వంటి వారు నటించిన చిత్రాలు ఒక్కటి కూడా దీపావళి రేస్‌లో లేవు. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 31) విడుదలవుతున్న మూడు చిత్రాల వివరాలను సంక్షిప్తంగా పరిశీలిస్తే...

Also Read- Chaitu Sobhita Wedding: నాగచైతన్య, శోభితాల పెళ్లికి తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే

అమరన్‌...

కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన కేరళ రాష్ట్రానికి చెందిన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అగ్రనటుడు కమల్‌ హాసన్‌ రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్నట్టు ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో లైవ్‌ లొకేషన్లలో ఈ చిత్రాన్ని ఇండియన్‌ ఆర్మీ అనుమతితో చిత్రీకరించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన ఆర్మీ అధికారులు చిత్ర బృందాన్ని ప్రశంసల వర్షంలో ముంచెత్తడంతో చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, లిరికల్‌ సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టిందంటూ ప్రచారం సాగుతోంది. శివకార్తికేయన్‌ నటించిన చిత్రం దీపావళికి విడుదలకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


బ్లడీ బెగ్గర్‌...

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ‘జైలర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తొలిసారి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు. తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివబాలన్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టి మంచి ఫాన్స్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న కవిన్‌ హీరోగా నటించారు. నిర్మాత నెల్సన్‌ స్నేహితుడు కూడా. ఈ యేడాది కవిన్‌ నటించిన ‘డాడా’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇపుడు తొలిసారి దీపావళికి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Also Read-Jai Hanuman: ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా ఎవరంటే.. లుక్ వచ్చేసింది


బ్రదర్‌...

‘శివ మనసుల శక్తి’, ‘బాస్‌ ఎన్‌గిర భాస్కరన్‌, ‘ఒరు కల్‌ ఒరు కన్నాడి’ వంటి చిత్రాలతో వరుస హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్న ఎం.రాజేష్‌... ఆ తర్వాత తెరకెక్కించిన ఐదు చిత్రాలు వరుస పరాజయాలను చవిచూశాయి. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును దర్శకుడు రాజేష్‌ చేపట్టారు. ఈయన తొలిసారి అక్కా - తమ్ముడు సెంటిమెంట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఇప్పటికే ఈ చిత్ర ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే, దాదాపు 12 యేళ్ళ తర్వాత రాజేష - హ్యారీస్‌ జయరాజ్‌ పనిచేసిన చిత్రం కావడం గమనార్హం. పైగా హారీస్‌ జయరాజ్‌కు ఈ సినిమా కమ్‌బ్యాక్‌ మూవీగా ఉంటుందని భావిస్తున్నారు.

మరి ఈ మూడు చిత్రాలలో దీపావళికి పేలే పటాస్ ఏదనేది ఇంకాసేపట్లో తెలిసిపోనుంది.

Also Read-NTR: కొత్త NTR వచ్చేశాడు.. జూ. ఎన్టీయార్ ఏమన్నాడంటే

Also Read-Star Heroine: ఈ ఫొటోలోని పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 31 , 2024 | 08:36 AM