మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..

ABN, Publish Date - Mar 30 , 2024 | 04:49 PM

పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాగూర్‌ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైనర్‌ అని ఆ చిత్ర నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఇందులో లవ్, ఫైట్స్‌, కామెడీ, ఎమోషన్‌ ఇలా అన్ని సమపాళ్ళలో ఉన్నాయన్నారు. ఏప్రిల్‌ 5న విడుదలకానున్న ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం చెన్నై నగరంలో నిర్మాత దిల్‌ రాజు, హీరో విజయ్‌ దేవరకొండ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

Vijay Deverakonda and Dil Raju

పరశురామ్‌ (Parasuram) దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాగూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) మూవీ ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైనర్‌ అని ఆ చిత్ర నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) అన్నారు. ఇందులో లవ్, ఫైట్స్‌, కామెడీ, ఎమోషన్‌ ఇలా అన్ని సమపాళ్ళలో ఉన్నాయన్నారు. తమిళం, తెలుగు భాషల్లో ఏప్రిల్‌ 5న, ఆ తర్వాత హిందీలో విడుదలకానున్న ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం చెన్నై నగరంలో నిర్మాత దిల్‌ రాజు, హీరో విజయ్‌ దేవరకొండ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘తమిళనాడు (Tamil Nadu)లో సాంబార్‌ ఇండ్లీ, కుంభకోణం కాఫీ, తాళి ఎంత ఫేమస్సో.. ఈ మూడు కలగలిసిన చిత్రం మా ‘ఫ్యామిలీ స్టార్’ కూడా అంతే ఎంటర్‌టైనర్‌‌గా ఉంటుంది. ఫైట్స్‌, కామెడీ, భావోద్వేగాలు అన్నీ పక్కా సమ్మర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఒక కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లే ప్రతి మనిషీ ఫ్యామిలీ స్టారే. ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీ స్టార్స్‌లా మారుతారు. ఇది ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. విజయ్‌ దేవరకొండకు ఇప్పటివరకు రౌడీ అనే ముద్దుపేరుంది. ఈ సినిమా తర్వాత అది ఫ్యామిలీ స్టార్‌గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కంటెంట్‌ ఉన్న చిత్రాలు నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తాయి. అలాంటిదే మా బ్యానర్‌లో వచ్చిన ‘బలగం’ (Balagam) చిత్రం. ఈ సినిమాకు దాదాపు వందకుపైగా అవార్డులు వచ్చాయి’’ అని పేర్కొన్నారు.


విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘నాకు కోలీవుడ్‌లో కూడా అభిమానులున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్‌ మొదలైంది. నేను నటించిన ప్రతి చిత్రం తమిళంలోకి అనువాదమవుతుంది. ఇది ‘గీతగోవిందం’ (Geetha Govindam) కంటే రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్‌ చేస్తారు. కేవలం ఒక జోనర్‌లోనే ఇమిడిపోవాలన్న ఉద్దేశం లేదు. పలువురు తమిళ దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి. అవి ఫలిస్తే కోలీవుడ్‌ (Kollywood) దర్శకుడి డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తాను’’ అన్నారు. మీడియా సమావేశంలో ఈ చిత్రాన్ని తమిళంలో రిలీజ్‌ చేస్తున్న నిర్మాత స్వరూప్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Adiparvam: ప్రచార చిత్రంతోనే ఫైర్ చూపించిన మంచు లక్ష్మీ

***********************

*Kaliyugam Pattanamlo: షాక్.. ‘కలియుగం పట్టణంలో’ ఆపేశారు..

************************

*Anupama Parameswaran: ఆనందంలో మాటలు రావడంలేదు

************************

Updated Date - Mar 30 , 2024 | 04:49 PM