మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

VIjay Antony: నా సినిమాని మరో 'అన్బే శివం' చేయొద్దు, 'ఎక్స్' లో పోస్ట్ వైరల్

ABN, Publish Date - Apr 20 , 2024 | 01:03 PM

విజయ్ ఆంటోనీ తన సినిమా సరిగ్గా నడవకపోవటానికి కారణం విమర్శకులు సరైన రివ్యూలు ఇవ్వకపోవటమే అని పరోక్షంగా విమర్శిచారు. తన సినిమాని మరో 'అన్బే శివం' చేయొద్దు అని ఈ పోస్టులో చెప్పారు. ఇది ఇప్పుడు సామాజిక మాదేమంలో వైరల్ అవుతోంది.

A still from Love Guru

విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు' అనే సినిమాతో అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు. అతని తమిళ సినిమాలన్నీ తెలుగులో అనువాదం సినిమాలుగా విడుదలవుతూ ఉంటాయి. తాజాగా అతను చేసిన తమిళ సినిమా 'రోమియో' తెలుగులో 'లవ్ గురు' అనే సినిమాగా అనువాదం చేసి విడుదల చేశారు. విజయ్ ఆంటోనీ స్వంతంగానే ఈ సినిమా నిర్మిస్తే, దీనికి వినాయక్ వైద్యనాధన్ దర్శకుడు, మృణాలని రవి కథానాయిక. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది, బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడింది అనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని అంతగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. తమిళంలో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలబడింది అని అంటున్నారు. (Vijay Antony's post on 'X' is going viral)

ఇదిలా ఉండగా విజయ్ ఆంటోనీ ఈరోజు సామజిక మాధ్యమైన 'ఎక్స్' లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో సారాంశం ఏంటంటే అతను రివ్యూ రాసేవాళ్లపై విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. కొంతమంది మేధావులు తమకే అన్నీ తెలుసు అన్నట్టుగా గొప్ప సినిమాల గురించి కూడా విమర్శిస్తుంటారు, కానీ వారి మాటలను నమ్మవద్దు. దగ్గరలో వున్న థియేటర్ కి వెళ్లి 'రోమియో' సినిమా చూడండి. దయచేసి నా చిత్రాన్ని మరో 'అన్బే శివం' చేయొద్దు అని విజయ్ ఆంటోనీ పోస్టు పెట్టారు. కమల్ హాసన్ నటించిన 'అన్బే శివం' సినిమా మంచి సినిమా అని అంటారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. విజయ్ ఆంటోనీ ఈ పోస్టును తమిళంలో చేశారు. (Vijay Antony fires on critics for not promoting his film 'Romeo'.)

Love Guru Movie Review: ఇది ఆ హిందీ సినిమాకి రీమేక్ లా అనిపిస్తోంది

ఇప్పుడు విజయ్ ఆంటోనీ తాను తీసిన రోమియో/ లవ్ గురు సినిమా కూడా గొప్ప సినిమా అని చెపుతూ, కొంతమంది ఈ సినిమాని నడవకుండా మంచి విశ్లేషణలు ఇవ్వలేదు అని విమర్సకులను పరోక్షంగా విజయ్ ఆంటోనీ విమర్శిస్తున్నారు. విజయ్ ఆంటోనీ తీసిన ఈ 'రోమియో/ లవ్ గురు' సినిమా షా రుఖ్ ఖాన్, అనుష్క శర్మ నటించిన 'రబ్ నె బనా ది జోడి' హిందీ సినిమాకి కొంచెం మార్పులు చేసి తీసిన సినిమాగా చెపుతున్నారు. ఇది ఒక ప్రేమ, వినోదం కలిపి తీసిన సినిమా. ఇప్పుడు విజయ్ ఆంటోనీ పెట్టిన ఈ పోస్టు, సామజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.

అయితే విజయ్ ఆంటోనీ పెట్టిన ఈ పోస్టుకి చాలామంది సమాధానం ఇచ్చారు. అందులో చాలామంది ఈ సినిమా నచ్చలేదని చెపుతూ వున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, బాగోలేదు కాబట్టే చూడటం లేదని చెప్పారు. అలాగే కొందరు ఈ 'రోమియో' సినిమాని 'అన్బే శివం' తో పోల్చడం కూడా తప్పు పడుతున్నారు. ఏమైనా ఈ పోస్టు పై ఇప్పుడు నెటిజన్స్ విపరీతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:03 PM