Vijay 69: విజయ్‌ 69 ఖరారు.. దర్శకుడి ప్రకటన!    

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:29 PM

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తన 69వ చిత్రం అనంతరం సినిమాలకు విరామం తీసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు హెచ్‌.వినోద్‌ అప్‌డేట్‌ ఇచ్చారు

Vijay Movie New Director

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తన 69వ(Vijay 69)చిత్రం అనంతరం సినిమాలకు విరామం తీసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు హెచ్‌.వినోద్‌ (H vinod)అప్‌డేట్‌ ఇచ్చారు. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘దళపతి 69’ (Thalapathy 69)అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది రూపొందనుంది. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్‌ గురించి ఎన్నో వార్తలు  సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. తాజాగా హెచ్‌ వినోద్‌ ఈ చిత్రం గురించి ఓ అవార్డు కార్యక్రమంలో మాట్లాడారు. విజయ్‌ చివరి సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు  తెలిపారు. అందరూ అనుకుంటున్నట్లు ఇది పొలిటికల్‌ థ్రిల్లర్‌ కాదని.. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని పేర్కొన్నారు.   

ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఇందులో కీలక పాత్రలో నటించనున్నట్లు, సమంత, మమితా బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు అందించనున్నారు. ప్రస్తుతం విజయ్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌తో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రధారులు. సెప్టెంబర్‌ 5న సినిమా విడుదల కానుంది.

Updated Date - Aug 16 , 2024 | 05:56 PM