మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vetrimaaran: స్క్రిప్ట్, స్క్రిన్‌ప్లే పక్కాగా ఉంటే డైనోసార్‌ను పెట్టి కూడా హిట్టు కొట్టొచ్చు..

ABN, Publish Date - Mar 24 , 2024 | 07:13 PM

స్క్రిప్ట్, స్ర్కీన్‌ప్లే పక్కాగా ఉంటే డైనోసార్‌ను హీరో పాత్రలో పెట్టి సినిమా తీసినా విజయం తథ్యమని, ఈ మాటలు వివాదాస్పదం అవుతాయని తెలిసినప్పటికీ.. ఇదే వాస్తవమని ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ అన్నారు. యాక్సెస్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత జి. ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం ‘కల్వన్‌’. ఏప్రిల్‌ 4వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ఆడియో వేడుకకు వెట్రిమారన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Vetrimaaran

స్క్రిప్ట్, స్క్రిన్‌ప్లే పక్కాగా ఉంటే డైనోసార్‌ను హీరో పాత్రలో పెట్టి సినిమా తీసినా విజయం తథ్యమని, ఈ మాటలు వివాదాస్పదం అవుతాయని తెలిసినప్పటికీ.. ఇదే వాస్తవమని ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ అన్నారు. యాక్సెస్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత జి. ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం ‘కల్వన్‌’ (Kalvan). ఏప్రిల్‌ 4వ తేదీన విడుదలకానుంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌, ఇవాన హీరోహీరోయిన్లు. దర్శక శిఖరం భారతీరాజా ఓ ముఖ్య పాత్రను పోషించారు. ధీనా, ఙ్ఞానసంబంధం, వినోద్‌ మున్నా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. హీరోగా నటించిన జీవీ ప్రకాష్‌ పాటలకు సంగీతం అందించగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ రెవా కంపోజ్‌ చేశారు. పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన పీవీ శంకర్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయనే చాయాగ్రహణం కూడా అందించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక శనివారం నగరంలో జరిగింది. దర్శకుడు వెట్రిమారన్‌ ముఖ్య అతిథిగాను, సీనియర్‌ దర్శకుడు ఉదయకుమార్‌, పేరరసు, లింగుస్వామి, అమ్మ క్రియేషన్స్‌ అధినేత టి.శివ, సత్యజ్యోతి ఫిలిమ్స్‌ అధినేత త్యాగరాజన్‌, నిర్మాత ధనుంజయన్‌లతో పాటు జీవీ ప్రకాష్‌, ఇవాన, పీవీ శంకర్‌, చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. (Kalvan Audio Launch Event)

ఈ కార్యక్రమంలో వెట్రిమారన్‌ (Vetrimaaran) మాట్లాడుతూ.. ‘‘ఫారెస్ట్‌ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంది. నిజానికి అడవిలో ఒక చిత్రం షూటింగ్‌ చేయడం చాలా కష్టం. ఒక సన్నివేశాన్ని వెండితెరపై అద్భుతంగా పండించే దర్శక నటుడు భారతీరాజా. ఆయన పాత్ర చిత్రానికి ఎంతో బలం. జీవీ ప్రకాష్‌ కమిట్‌మెంట్‌ కలిగిన నటుడు. అటు సంగీత దర్శకుడిగా, ఇటు హీరోగా రాణిస్తున్నారు’ అన్నారు.


చిత్ర నిర్మాత ఢిల్లీబాబు (Delhibabu) మాట్లాడుతూ.. భారతీరాజా జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ మూవీని తెరకెక్కించే భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. అలాంటి అవకాశం మా నిర్మాణ సంస్థకు వస్తే మాత్రం బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా, వెట్రిమారన్‌ సమ్మతిస్తే ఆయన దర్శకత్వంలోనే ఆ చిత్రాన్ని నిర్మించేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. భారతీరాజా మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన పీవీ శంకర్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్తాడు. నటీనటుల నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకునే విషయంలో ఏమాత్రం రాజీపడడు. అతన్ని పనితీరును చూస్తే తొలి చిత్ర దర్శకుడు అని ఏ ఒక్కరు అనుకోరు. ఈ చిత్రంలో నన్ను అలా కష్టపెట్టి తనకు కావాల్సిన నటనను రాబట్టుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఢిల్లీబాబుకు ధన్యవాదాలని అన్నారు.

చిత్ర దర్శకుడు పీవీ శంకర్‌ (PV Shankar) మాట్లాడుతూ.. 2019లో ఈ చిత్రం ప్రారంభించినప్పటికీ కరోనా మహమ్మారి, చిత్రీకరణ సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురుకావడంతో జాప్యం జరిగింది. ప్రతి ఒక్కరికీ నచ్చేలా చిత్రం ఉంటుందని తెలపగా.. హీరో జీవీ ప్రకాష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఒక మంచి కథతో, ప్రతి ఒక్కరకీ నచ్చే చిత్రంతో వచ్చే నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మీడియా అండగా ఉండాలి’ అని కోరారు. హీరోయిన్‌ ఇవాన తదితరులు ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: హీరో శ్రీకాంత్ ఇంట్లో చిరు.. మ్యాటర్ ఇదే..

******************************

*Chiranjeevi: ‘అదే రక్తం.. అదే పౌరుషం’ డైలాగ్‌ని మార్చిన చిరు..

**************************

*Bade Miyan Chote Miyan: ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

*******************************

Updated Date - Mar 24 , 2024 | 07:13 PM