Vanitha Vijaykumar: మరో బాంబ్ పేల్చిన వనితా విజయకుమార్
ABN, Publish Date - May 03 , 2024 | 10:37 PM
తమిళ చిత్రపరిశ్రమను నమ్ముకుని, ఇక్కడే స్థిరపడిన నటీనటులకు సినిమా అవకాశాలు ఎక్కడ అంటూ సినీ నటి వనితా విజయకుమార్ ప్రశ్నిస్తున్నారు. వనిత, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండుపాళ్యం’. ముమైత్ ఖాన్, సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సుబ్రమణ్యం, బిర్లా బోస్, ఆలియా, నిషా రఫీక్ ఘోష్, రవిశంకర్ తదితరులు నటించగా, టైగర్ వెంకట్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ఆడియోని రిలీజ్ చేశారు.
తమిళ చిత్రపరిశ్రమను నమ్ముకుని, ఇక్కడే స్థిరపడిన నటీనటులకు సినిమా అవకాశాలు ఎక్కడ అంటూ సినీ నటి వనితా విజయకుమార్ ప్రశ్నిస్తున్నారు. వనిత (Vanitha Vijaykumar), సోనియా అగర్వాల్ (Sonia Agarwal) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండుపాళ్యం’ (Thandupalayam). ఇతర పాత్రల్లో ముమైత్ ఖాన్, సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సుబ్రమణ్యం, బిర్లా బోస్, ఆలియా, నిషా రఫీక్ ఘోష్, రవిశంకర్ తదితరులు నటించగా, టైగర్ వెంకట్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో కార్యక్రమంలో సినీ ప్రముఖులు ఆర్.అరవింద్‌రాజ్, మంగై అరిరాజన్, సౌందర్, ఎన్.విజయమురళి, క్రైమ్ సెల్వరాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియో రిలీజ్ చేశారు.
*Natti Kumar: ఎన్నారైలు వచ్చి కూటమికి సపోర్ట్ చేస్తున్నారు.. సినిమా వాళ్లు ఎందుకు రావడం లేదు?
ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. 1980 నుంచి నేటి వరకు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలు వంటి ఘోరాలకు ఓ ముఠా పాల్పడుతుంది. వీరిలో ఒక బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఈ ముఠాపై 390 చోరీలు, 108 హత్యలు, 90 అత్యాచారం లాంటి కేసులు ఉన్నాయి. ఒకే ముఠాకు ఆరు సార్లు మరణశిక్ష పడుతుంది. ఈ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ, ఇప్పటివరకు ఒక్కరికి కూడా మరణ శిక్ష అమలు చేయలేదు. అరెస్టయిన వారిని అన్ని కేసుల్లో నిర్దోషులుగా విడుదల చేస్తున్నారు. ఇపుడు కేవలం పది కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులోని నిందితులంతా నిరక్ష్యరాస్యులైన దినసరి కూలీలు. ఇలాంటి యధార్ధ సంఘటనల సమూహారమే ఈ చిత్ర కథ. మొదటి భాగానికి రెండో భాగానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. (Thandupalayam Audio Launch Event)
వనితా విజయకుమార్ (Vanitha Vijaykumar) మాట్లాడుతూ.. ఒక మంచి కథలో నటించానన్న అనుభూతి మిగిలింది. సహ నటి సోనియా అగర్వాల్ (Sonia Agarwal)తో మంచి బాండింగ్ ఏర్పడింది. తమిళనాడులో స్థిరపడి, ఇండస్ట్రీనే నమ్ముకున్న వారికి అవకాశాలు రావడం లేదు. ఇది విచారించదగిన విషయం. వాస్తవిక సంఘటనలను అద్భుతంగా తెరకెక్కించారు. అనేక సన్నివేశాల్లో సోనియాతో పోటీపడి నటించానని పేర్కొన్నారు.