‘రామస్వామి’ డైలాగ్ వివాదంపై దర్శకుడు క్లారిటీ
ABN, Publish Date - Jan 19 , 2024 | 05:02 PM
హాస్య నటుడు సంతానం హీరోగా రూపుదిద్దుకున్న ‘వడకుపట్టి రామస్వామి’ చిత్ర కథలో ఎలాంటి వివాదం లేదని ఆ చిత్ర దర్శకుడు కార్తీక్ యోగి తెలిపారు. వచ్చే నెల రెండో తేదీ ఈ చిత్రం విడుదలకానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదలై పెను వివాదానికి దారితీసింది. ఈ ట్రైలర్‌లో ‘నేను ఆ రామస్వామి’ని కాదంటూ హీరో చెప్పే డైలాగ్ చర్చకు తెరలేపింది. దీనిపై దర్శకుడు వివరణ ఇచ్చారు.
హాస్య నటుడు సంతానం (Santhanam) హీరోగా రూపుదిద్దుకున్న ‘వడకుపట్టి రామస్వామి’ (Vadakupatti Ramasamy) చిత్ర కథలో ఎలాంటి వివాదం లేదని ఆ చిత్ర దర్శకుడు కార్తీక్ యోగి తెలిపారు. వచ్చే నెల రెండో తేదీ ఈ చిత్రం విడుదలకానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదలై పెను వివాదానికి దారితీసింది. ఈ ట్రైలర్‌లో ‘నేను ఆ రామస్వామి’ని కాదంటూ హీరో చెప్పే డైలాగ్ చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు వివరణ ఇచ్చారు.
‘‘నా తొలి చిత్రం ‘డిక్కీలూన’ హీరో సంతానం. ఇపుడు రెండో చిత్రాన్ని కూడా సంతానంతోనే నిర్మించాను. 1974 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఒక గ్రామంలో కండ్ల కలక (మద్రాస్ ఐ) వస్తుంది. దీన్ని ఈ గ్రామానికి చెందిన రామస్వామి అనే యువకుడు ఎలా తనకు అనుకూలంగా మలచుకున్నాడన్నదే కథ. పూర్తి హాస్యభరితంగా సాగుతుంది. నిళల్‌గల్ రవి పాత్ర సినిమాలో ట్విస్ట్. హీరోయిన్ మేఘా ఆకాష్ ఆర్మీలో పనిచేసే వైద్యురాలి పాత్ర పోషించారు. పళని, దిండిగల్, మదురై తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఖర్చు ఎక్కువ కావడంతో తెలుగులో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను సంప్రదించగా, స్టోరీ విన్న వెంటనే ప్రాజెక్టు చేసేందుకు అంగీకరించారు. అలా మొదలైన ఈ సినిమా వచ్చే నెల రెండో తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. (Vadakupatti Ramasamy Dialogue Controversy)
రామస్వామి అనే డైలాగ్‌లో ఎలాంటి వివాదం లేదు. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇందులోని ఓ పాటను సంతానం స్వయంగా ఆలపించారు. ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు చిత్రంలో ఉన్నాయి. ‘డిక్కీలూన’ టైమ్ ట్రావెల్ జోనర్‌లో సాగుతుంది. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో 1974 నేపథ్యంలో సాగే కథ. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని దర్శకుడు కార్తీక్ యోగి వివరించారు. కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రంలో సంతానం, మేఘా ఆకాష్, నిళల్‌గల్ రవి, ఎంఎస్.భాస్కర్, మారన్ తదితరులు నటించగా సేన్ రోల్డన్ సంగీతం సమకూర్చారు.