Vijay: విజయ్ పార్టీలో చేరనున్న ఆ ఇద్దరు నటులు?
ABN, Publish Date - Jun 19 , 2024 | 09:41 AM
వివిధ రూపాల్లో తమకు స్థాయికి తగినట్టుగా సాయం చేస్తున్న నటులు రాఘవ లారెన్స్, కేపీవై బాలా.. అగ్ర హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ చిత్రపరిశ్రమలో తమ సంపాదనలో వీరిద్దరూ వేర్వేరుగా అనేక మందికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాఘవ లారెన్స్, కేపీవై బాలాలు ఇపుడు విజయ్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం.
వివిధ రూపాల్లో తమకు స్థాయికి తగినట్టుగా సాయం చేస్తున్న నటులు రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కేపీవై బాలా (KPY Bala).. అగ్ర హీరో విజయ్ (Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam)లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ చిత్రపరిశ్రమలో తమ సంపాదనలో వీరిద్దరూ వేర్వేరుగా అనేక మందికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లారెన్స్ అడుగు ముందుకేసి ‘మాట్రం’ పేరుతో ట్రస్ట్‌ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా పలువురు రైతులకు ట్రాక్టర్లను ఉచితంగా అందించారు. అలాగే, కేపీవై బాలా తాను సంపాదించే మొత్తంలో తన ఖర్చులకు ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ప్రజాసేవకు ఖర్చు చేస్తున్నారు. ఆ కోవలో ఓ గ్రామానికి అంబులెన్స్‌ను, మరో మహిళకు ఆటోను కొనిచ్చారు.
Also Read- Kushitha Kallapu: లేలేత పరువాలతో.. కవ్విస్తోన్న ‘బజ్జీల’ పాప
ఈ నేపథ్యంలో హీరో విజయ్ కూడా తనవంతుగా సాయం చేస్తున్నారు. ఆయన తమిళగ వెట్రి కళగం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాఘవ లారెన్స్, కేపీవై బాలాలు ఇపుడు విజయ్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంపై టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ వారిద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. (Tamil Nadu Politics)
వీరిద్దరే కాదు.. మరికొందరు నటీనటులు కూడా విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనేలా కోలీవుడ్ (Kollywood) మీడియాలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ పూర్తి స్థాయిలో పొలిటికల్ బాట పట్టినప్పుడు వారంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విజయ్ తను అంగీకరించిన సినిమాలను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.
Read Latest Cinema News