Thalapathy69: దళపతి విజయ్ లాస్ట్ సినిమా హీరోయిన్ ఫిక్స్.. ఇది బాలయ్య సినిమాకు రీమేకేనా..

ABN, Publish Date - Oct 03 , 2024 | 03:17 PM

దళపతి విజయ్ రాజకీయాలలోకి అడుగుపెడుతోన్న తరుణంలో.. అతను హీరోగా నటిస్తున్న చివరి సినిమా Thalapathy69. తాజాగా ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఫ్యాన్స్‌కి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనేలా వార్తలు వైరల్ అవుతుండటం విశేషం. ఇంతకీ మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే..

Thalapathy69 Movie Update

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమా Thalapathy69 అనౌన్స్‌మెంట్ (Vijay69 Announcement) తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలజడిని సృష్టించిన విషయం తెలిసిందే. విజయ్ రాజకీయాలలోకి అడుగుపెడుతోన్న తరుణంలో.. ఆయన హీరోగా నటిస్తున్న చివరి సినిమా ఇది. మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డ‌మ్‌తో స్టార్ హీరోగా ఇండస్ట్రీ‌ని ఏలారు. ‘తుణివు, వలిమై’ చిత్రాల దర్శకుడు హెచ్ వినోద్ (H Vinoth) ఈ Thalapathy69 కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. తాజాగా ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఫ్యాన్స్‌కి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Also Read- Tollywood: అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు


Thalapathy69 చిత్రం దళపతి అభిమానులకు ఎంతో ప్రత్యేకం కానుంది. విజయ్ చివరి సినిమా కానుండటంతో నిర్మాతలు కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఎంపికలు చేపట్టారు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించిన బీస్ట్ (Beast) మూవీలో దళపతి సరసన నటించిన పూజా హెగ్డే (Pooja Hegde)ని ఈ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. ఈ బుట్టబొమ్మ హీరోయిన్ అంటూ నిర్మాతలు అఫిషియల్‌గా ప్రకటించారు. ‘బీస్ట్’ మూవీలోని అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించిన ‘హలమతి హబిబో’ (Halamathi Habibo) సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాటలో మినహా పూజా క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో ఈ సారైనా పూజాకి మంచి రోల్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే దళపతి చివరి సినిమా కానుండటంతో ఈసారి కూడా పూజా రోల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవొచ్చు అనే అపోహలు ఉన్నాయి.


ఇప్పటికే రిలీజైన సినిమా పోస్టర్‌లో ద టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ ఎరైవింగ్ సూన్ (The Torch Bearer of Democracy Arriving Soon) అంటూ.. విజయ్ రాజకీయాలలోకి వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఈ మూవీ 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్‌లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం (Music) అందించనుండగా.. జగదీష్ పళనిస్వామి లోహిత్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఎన్. కే. వెంకట్ కే నారాయణ ఆధ్వర్యంలో ఈ మూవీ నిర్మితం కానుంది. మరోవైపు ఈ సినిమా టాలీవుడ్‌లో బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘భగవంత్ కేసరి’లో కాజల్ చేసిన పాత్రను పూజా హెగ్డే చేయనుందని, అలాగే శ్రీలీల చేసిన పాత్రను మమిత బైజును తీసుకున్నట్లుగా కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read- King Nagarjuna: వెనక్కి తీసుకోండి.. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగార్జున

Also Read- Pawan Kalyan: తిరుమలలో పవన్ క‌ల్యాణ్‌ చిన్న‌ కుమార్తె.. డిక్లరేషన్ ఇచ్చి దైవ ద‌ర్శనానికి

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2024 | 03:35 PM