Vijay: అభిమానులకు హీరో దళపతి విజయ్ షరతు
ABN, Publish Date - Aug 09 , 2024 | 08:44 PM
తన అభిమానులకు హీరో విజయ్ ఒక షరతు విధించారు. తాను నటించిన కొత్త చిత్రం ‘ది గోట్’ సినిమా ప్రమోషన్, ప్రచార కార్యక్రమాల్లో తాను స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (పార్టీ) పేరు ఎక్కడా వినియోగించకూడదని కండిషన్ పెట్టారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదలకానుంది.
తన అభిమానులకు హీరో విజయ్ (Thalapathy Vijay) ఒక షరతు (Condition) విధించారు. తాను నటించిన కొత్త చిత్రం ‘ది గోట్’ (The Goat) సినిమా ప్రమోషన్, ప్రచార కార్యక్రమాల్లో తాను స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (పార్టీ) (Tamilaga Vettri Kazhagam) పేరు ఎక్కడా వినియోగించకూడదని కండిషన్ పెట్టారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదలకానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి మూడు లిరికల్ సాంగ్‌లను విడుదల చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. (Thalapathy Vijay Fans)
Also Read- NTR: ఎన్టీఆర్ పేరుతో మరో వారసుడు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్
అదే సమయంలో టీవీకే కార్యకర్తలు ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటూ పార్టీ పేరు, పతాకాన్ని ఉపయోగిస్తున్నారు. వీటిన్నింటినీ పరిశీలించిన ఆయన... ‘ది గోట్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీపేరు ఉపయోగించరాదని ఆదేశించారు. ‘సినిమా వేరు.. రాజకీయాలు వేరు.. ఈ రెండింటిని అనుసంధానం చేయవద్దు’’ అని విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నిర్ణయాన్ని కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు అభిమానులు మాత్రం అధికార పార్టీ వాళ్లు చేస్తున్నారుగా.. మనం చేస్తే తప్పేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. (The Goat Movie Promotions)
The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమా విషయానికి వస్తే.. దళపతి విజయ్, వెంకట్ ప్రభు (Venkat Prabhu)ల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ చార్ట్ బస్టర్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ ‘విజిలేస్కో’, సెకండ్ సింగిల్ ‘నిన్ను కన్న కనులే’, మూడో సింగిల్ ‘స్పార్క్’ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్ (Prashanth), ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary), వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
Read Latest Cinema News