Tanya Ravichandran: హోమ్లీ ఇమేజ్‌ను పక్కనెట్టి.. గ్లామర్‌ వైపు ‘తాన్య’

ABN, Publish Date - Jun 18 , 2024 | 01:19 PM

సీనియర్‌ నటుడు రవిచంద్రన్‌ మనుమరాలిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి హోమ్లీ గర్ల్‌గా ముద్రవేసుకున్న తాన్య రవిచంద్రన్‌ దృష్టి ఇపుడు గ్లామర్‌ వైపు మళ్ళింది. ఇప్పటివరకు ఎంతో సంప్రదాయబద్ధమైన పాత్రలను ఎంచుకుంటూ సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇపుడు ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Heroine Tanya Ravichandran

సీనియర్‌ నటుడు రవిచంద్రన్‌ (Ravichandran) మనుమరాలిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి హోమ్లీ గర్ల్‌గా ముద్రవేసుకున్న తాన్య రవిచంద్రన్‌ (Tanya Ravichandran) దృష్టి ఇపుడు గ్లామర్‌ వైపు మళ్ళింది. ఇప్పటివరకు ఎంతో సంప్రదాయబద్ధమైన పాత్రలను ఎంచుకుంటూ సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇపుడు ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇపుడు రూపొందుతున్న ప్రతి సినిమాలో గ్లామర్‌ తప్పనిసరిగా మారింది. దీంతో ఆమె కూడా అటువైపు దృష్టిసారించినట్టు సమాచారం.

Also Read- Anjali: అంజలి 38వ పుట్టినరోజు ఎక్కడ సెలెబ్రేట్ చేసుకున్నారో తెలుసా


ఇటీవల అర్జున్‌ దాస్‌ ‘రసవాది’ (Rasavathi) చిత్రంలో తాన్య పాత్రకు మంచి మార్కులతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం అరుణ్‌ విజయ్‌ (Arjun Vijay)తో కలిసి ‘రెట్టతల’ (Retta Thala)లో నటిస్తున్నారు. ఇప్పటివరకు హోమ్లీగర్ల్‌గా కనిపించిన తాన్య‌కు సరైన హిట్ మాత్రం పడలేదు. కానీ ‘రసవాది’ చిత్రంలో ఆమె కాస్త గ్లామర్ డోస్‌ని పెంచి మరీ నటించింది. ఈ పాత్రకు మంచి పేరు.. సినిమా కూడా బాగా కలెక్షన్స్‌ని రాబడుతుండటంతో.. ఇకపై గ్లామర్‌ పాత్రల్లో నటించేందుకు సైతం ఆమె సమ్మతించినట్టు తెలుస్తుంది.


తాన్య రవిచంద్రన్‌ తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. తెలుగులో ఆమె కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ (Raja Vikramarka) చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా సరైన విజయాన్ని అందుకోలేకపోవడంతో.. తెలుగు ప్రేక్షకులకు ఆమె పెద్దగా రిజిస్టర్ కాలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మోహన్ రాజా (Mohan Raja) కాంబినేషన్‌లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ (God Father) సినిమాలో చిరు, నయనతార (Nayanthara)ల సోదరిగా తాన్య రవిచంద్రన్ నటించింది. ఆ పాత్రతో తెలుగులోనూ ఆమె మంచి గుర్తింపును అయితే సొంతం చేసుకుంది కానీ.. అవకాశాలు మాత్రం రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఆమె తమిళ చిత్ర పరిశ్రమకే పరిమితమైంది. మంచి సబ్జెక్ట్ దొరికితే.. తెలుగులోనూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉంది.

Read Latest Cinema News

Updated Date - Jun 18 , 2024 | 01:19 PM