మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Karthi: సూర్య నిర్మాత‌గా.. 96 ద‌ర్శ‌కుడితో కార్తీ కొత్త సినిమా! ఫ‌స్ట్ లుక్ సూప‌ర్

ABN, Publish Date - May 26 , 2024 | 08:53 AM

కార్తీ హీరోగా, త‌న సొద‌రుడు సూర్య నిర్మాత‌గా ఓ చిత్రం రెడీ అవుతోంది. ’96’ ఫేం సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. కార్తీ 27' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

karthi

కార్తీ (Karthi) హీరోగా, త‌న సొద‌రుడు సూర్య నిర్మాత‌గా ఓ చిత్రం రెడీ అవుతోంది. ’96’చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ (Prem Kumar) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్ (Rajsekar Pandian) సహ నిర్మాతగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్ (2D Entertainment ) పై జ్యోతిక (Jyotika), సూర్య (Suriya) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.'కార్తీ 27' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

కార్తీ పుట్టినరోజు సందర్భంగా మెయ్యళగన్ (Meiyazhagan )పేరుతో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అరవింద్ స్వామి (Arvind swami) ఈ సినిమాలో ఓ కీల‌క‌ పాత్ర పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ కార్తీ, అరవింద్ స్వామి (Arvind swami) మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూపించింది. అరవింద్ స్వామి సైకిల్ తొక్కుతుంటే, కార్తీ వెనుక కూర్చుని చిన్నపిల్లాడిలా పోజు ఇవ్వడం ఆకట్టుకుంది. తెలుగు తమిళ ద్విభాష చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ తెలుగు టైటిల్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు.


ఈ చిత్రంలో రాజ్‌కిరణ్ (Rajkiran), శ్రీదివ్య (Sri Divya), స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచెల్ రెబెక్కా, ఆంథోనీ, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్ , ఇతర ప్రతిభావంతులైన తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

’96’ చిత్రానికి సూపర్ మెలోడిక్ హిట్స్ అందించిన గోవింద్ వసంత (Govind Vasantha) ఈ సినిమా కోసం సి.ప్రేమ్ కుమార్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రం కుంభకోణం, శివగంగైలోని అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఎడిటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా తుదిదశకు చేరుకున్నాయి.

Updated Date - May 26 , 2024 | 08:53 AM