మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sundar C: నా జీవితం, కెరీర్‌లో ముఖ్యమైన చిత్రం ‘అరణ్మనై’..

ABN, Publish Date - Apr 02 , 2024 | 08:06 PM

‘అరణ్మనై’ చిత్రం తన సినీ కెరీర్‌లోనే కాకుండా, జీవితంలో ఎంతో ముఖ్యమైన మూవీ అని దర్శకుడు సుందర్‌ సి అన్నారు. ఆయన దర్శకత్వంలో వహించిన ‘అరణ్మనై’ సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రం ‘అరణ్మనై-4’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

Tamannaah, Raashi Khanna and Sundar C

‘అరణ్మనై’ చిత్రం తన సినీ కెరీర్‌లోనే కాకుండా, జీవితంలో ఎంతో ముఖ్యమైన మూవీ అని దర్శకుడు సుందర్‌ సి (Sundar C) అన్నారు. ఆయన దర్శకత్వంలో వహించిన ‘అరణ్మనై’ (Aranmanai) సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రం ‘అరణ్మనై-4’ (Aranmanai 4). ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దర్శకహీరో సుందర్ సి మాట్లాడుతూ... ‘అరణ్మనై’ మొదటి భాగాన్ని నిర్మించే సమయంలో సీక్వెల్స్‌ తీయాలన్న ఆలోచన లేదు. వేరే సినిమా కోసం కథా చర్చల్లో ఉన్నపుడు నా కో రైటర్‌ కీర్తి ఒక విషయం చెప్పారు. భారతదేశాన్ని పరిపాలించిన అనేక మంది రాజులు వివిధ ప్రాంతాలను ఆక్రమించారు. కానీ, తూర్పు ప్రాంతంలోని బ్రహ్మపుత్ర నది దాటి ఎవరూ వెళ్లలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఒకటి దెయ్యం భయం. దీనికి సంబంధించి అనేక జానపద కథలు ఇప్పటికీ స్థానికులు చెప్పుకుంటారు. ఈ విషయాలను ఈ చిత్రంలో పెట్టాలని భావించాం. గతంలో వచ్చిన ‘అరణ్మనై’ చిత్రాలకు కంటే భిన్నంగా ఈ ‘అరణ్మనై 4’ ఉంటుందని అన్నారు. (Sundar C Speech)


డాక్టర్‌ ఏసీ షణ్ముగం ఆశీస్సులతో బెంజ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌, అవ్ని సినీమాక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖుష్బూ (Khushbu Sundar) సమర్పణలో సుందర్‌ సి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సుందర్‌ సి, తమన్నా, రాశీఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్‌, ఢిల్లీ గణేష్‌, కోవై సరళ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ. కృష్ణస్వామి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి హిప్‌హాప్‌ తమిళ (Hiphop Tamizha) ఆది సంగీతం అందించారు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో హీరోయిన్లు తమన్నా (Tamannaah Bhatia), రాశీఖన్నా (Raashii Khanna), నటి ఖుష్బూ, నటులు యోగిబాబు, వీటీవీ గణేష్‌, జయప్రకాష్‌, హిప్‌హాప్‌ ఆది తదితరులు పాల్గొని ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు

***********************

*Saranya: సీనియర్ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు

***************************

*Siddu Jonnalagadda: మెగాస్టార్‌ చిరుతో మూవీ ఛాన్స్ వచ్చింది కానీ..

************************

Updated Date - Apr 02 , 2024 | 08:06 PM