Rajinikanth: రజనీ సినిమా కోసం ప్రేక్షకుడిలా విజయ్.. ఫ్యాన్స్‌ని ఆకర్షించేందుకేనా?
ABN, Publish Date - Oct 13 , 2024 | 02:36 PM
రజనీకాంత్, విజయ్ ఫ్యాన్స్‌కి మధ్య చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఈ హీరోలిద్దరూ కూడా ఇన్ డైరెక్ట్‌గా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్న నేపథ్యంలో.. సూపర్ స్టార్ సినిమా చూసేందుకు.. అందునా.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు రావడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) నటించిన ‘వేట్టయన్’ (Vettaiyan) చిత్రం గురువారం విడుదలకాగా, ఈ చిత్రాన్ని చూసేందుకు మరో అగ్రహీరో విజయ్ (Star Hero Vijay) థియేటర్‌కు వచ్చారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు తొలి ఆటను నగరంలోని దేవి థియేటర్‌లో ఆయన చూశారు. ఆయన థియేటర్‌కు వచ్చిన విషయం ఒక్కరికి కూడా తెలియదు. కానీ, వెళ్ళేటప్పుడు మాత్రం ప్రేక్షకులు పసిగట్టి, కారులో ఎక్కుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. టోపీ, ముఖానికి మాస్క్ ధరించి, ఎవరూ గుర్తుపట్టని విధంగా విజయ్ థియేటర్‌కు వచ్చి ‘వేట్టయన్’ సినిమా చూసి వెళ్ళారు. వాస్తవానికి రజనీకాంత్, విజయ్ ఫ్యాన్స్‌కి మధ్య చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఈ హీరోలిద్దరూ కూడా ఇన్ డైరెక్ట్‌గా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్న నేపథ్యంలో విజయ్ ఇలా దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Also Read- Devara: ఫ్యాన్స్ కోసమే.. ‘దేవర’ కలెక్షన్స్‌పై నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు
కాగా, రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్.. 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో లబ్ధిపొందేలా రజనీకాంత్ ఫ్యాన్స్‌ను ఆకర్షించేందుకే విజయ్ థియేటర్‌కు వచ్చి ‘వేట్టయన్’ చిత్రాన్ని చూశారంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, రజనీకాంత్ సతీమణి లత కూడా నగరంలోని ఓ థియేటర్‌లో సినిమా చూశారు. రజనీ అల్లుడు, హీరో ధనుష్ ఈ చిత్రం విడుదల సందర్భంగా ‘తలైవర్’ దర్శనం అంటూ ట్వీట్ చేశారు. ఆయన కూడా ఓ థియేటర్‌లో సినిమా చూస్తున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. వీరే కాదు, కోలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయన్’ చిత్రం ప్రదర్శించబడుతోన్న థియేటర్లలో దర్శనమివ్వడం విశేషం.
Also Read- Nara Rohit Engagement: కాబోయే శ్రీమతితో నారా రోహిత్.. ఫొటోలు వైరల్
మరోవైపు తమ అభిమాన హీరో చిత్రం విడుదలను పురస్కరించుకుని రజనీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అనేక థియేటర్ల వద్ద హంగామా చేశారు. రజనీ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సినిమాను చూసేందుకు రజనీ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. కోలీవుడ్‌లో ఈ సినిమా భారీగా కలెక్షన్స్‌ను రాబడుతోంది.