7G Movie: చేతబడి నేపథ్యంలో.. సీట్ ఎడ్జ్‌ థ్రిల్ల‌ర్ ‘7జీ’

ABN, Publish Date - Jun 26 , 2024 | 08:37 AM

సీనియర్‌ నటి సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7జీ’. చేతబడి నేపథ్యంలో రూపొందించిన ఈ హార్రర్‌ మూవీ విడుదల తేదీని ప్రకటించారు.

7/g

సీనియర్‌ నటి సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7జి’(7Gmovie). చేతబడి నేపథ్యంలో ఒక ఫీల్‌ గుడ్‌ మూవీగా దర్శకుడు హారూన్ (haroon.dh) రూపొందించారు. డ్రీమ్‌ హౌస్‌ బ్యానర్‌పై డైరెక్ట‌ర్‌ హారూన్ సంవ‌యంగా కథ సమకూర్చి నిర్మించారు.

సోనియా అగర్వాల్ (Sonia aggarwal), స్మృతి వెంకట్ (smruthi venkat) అద్భుత నటనతో ప్రతి ఒక్కరినీ భయపెట్టే హార్రర్‌ మూవీగా తెరకెక్కించగా వచ్చే నెల 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.


ఈ సినిమా గురించి దర్శకుడు హారూన్ (haroon.dh) మాట్లాడుతూ, ‘తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలని భావించిన ఒక యువతి కొత్తగా ఇంటిని కనుగోలు చేసి నివసిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో కొన్ని భయపెట్టే సంఘటనలు జరుగుతున్నట్టు గుర్తించి, ఇంటిలో చేతబడి చేసినట్టు గ్రహిస్తుంది.

వీటి వెనుక ఉన్న నిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఆమెకు కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వీటిని ప్రేక్షకుడు సీట్‌ ఎడ్జింగ్‌ థ్రిల్‌కు ఫీలయ్యేలా ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసేలా రూపొందించాం అని పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2024 | 08:37 AM