మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Box Office: నేడు పలు చిన్న చిత్రాలు విడుదల

ABN, Publish Date - Mar 15 , 2024 | 09:27 AM

మార్చి మూడో శుక్రవారం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిన్న బడ్జెట్‌ చిత్రాలు విడుదలకానున్నాయి. నిజానికి ఈ యేడాది ప్రారంభమై 75 రోజులకు పైగా గడిచిపోయింది. కానీ, ఇప్పటివరకు ప్రేక్షకులను అలరించేలా భారీ బడ్జెట్‌ చిత్రం రాకపోవడం గమనార్హం. ‘లాల్ సలామ్’, ‘కెప్టెన్ మిల్లర్’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. చూస్తుంటే.. ఈ వేసవికి కోలీవుడ్ అంతా డల్‌గానే ఉండేలా కనబడుతోంది. ఎందుకంటే, స్టార్ హీరోల సినిమాలేవీ ఈ వేసవికి వచ్చే పరిస్థితి కనబడటం లేదు.

Premalu Movie Still

మార్చి మూడో శుక్రవారం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిన్న బడ్జెట్‌ చిత్రాలు విడుదలకానున్నాయి. వాటిలో సముద్రఖని, యోగిబాబు కలిసి నటించిన ‘యావరుం వల్లవరే’ (Yavarum Vallavare).. ఆర్‌కే సురేష్‌ హీరోగా నటించిన ‘కాడువెట్టి’ (Kaduvetti).. మాస్టర్‌ మహేంద్రన్‌ కథానాయకుడిగా నటించిన ‘అమిగో గ్యారేజ్‌’ (Amigo Garage).. అనిష్‌, ముత్తుప్రియన్‌, మనిషాజిత్‌ నటించిన ‘ఆరాయిచ్చి’ (Aaraichi) తదితర చిత్రాలు విడుదలవుతున్నాయి. అలాగే, మలయాళం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ ‘ప్రేమలు’ (Premalu) మూవీని కూడా తమిళంలోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే తమిళంలోకి అనువాదమై విడుదలైన ‘మంజుమల్‌ బాయిస్‌’ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన పలు తమిళ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో ఏ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో వేచిచూడాల్సివుంది. వీటితో పాటు హిందీ చిత్రం ‘బస్తర్‌’, తెలుగు చిత్రం ‘రజాకర్‌’ ఉన్నాయి. నిజానికి ఈ యేడాది ప్రారంభమై 75 రోజులకు పైగా గడిచిపోయింది. కానీ, ఇప్పటివరకు ప్రేక్షకులను అలరించేలా భారీ బడ్జెట్‌ చిత్రం రాకపోవడం గమనార్హం.


‘లాల్ సలామ్’, ‘కెప్టెన్ మిల్లర్’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. చూస్తుంటే.. ఈ వేసవికి కోలీవుడ్ అంతా డల్‌గానే ఉండేలా కనబడుతోంది. ఎందుకంటే, స్టార్ హీరోల సినిమాలేవీ ఈ వేసవికి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. మరి చిన్న చిత్రాలు తమిళ ప్రేక్షకులని ఎలా అలరించనున్నాయో చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

====================

*AM Rathnam: పవన్ కళ్యాణ్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత పోస్ట్ వైరల్

*****************************

*Vishwak Sen: మా సినిమాని కూడా చూసి.. నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండి

************************

*Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్

*****************************

Updated Date - Mar 15 , 2024 | 09:27 AM