Simran: సిమ్రాన్ ఇద్దరు బిడ్డల తల్లి.. ఈ ఫ్యామిలీ కథే వేరు
ABN, Publish Date - Dec 08 , 2024 | 06:55 PM
సిమ్రాన్.. ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీని ఊపేసిన పేరు. ఇప్పుడామె సినిమాలు తగ్గించినప్పటికీ.. అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తూనే ఉంది. తాజాగా ఆమె హీరోయిన్‌గా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న న్యూ మూవీ ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా సౌత్ ఇండస్ట్రీని ఏలిన సిమ్రాన్ ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా ఆమెకు అవకాశాలు దగ్గడంతో తను కూడా తన దగ్గరకు వచ్చిన పాత్రలను తప్పితే.. పరుగులు పెట్టి చేయాలని భావించలేదు. అయినా అప్పుడప్పుడు తన వరకు వచ్చిన సినిమాలలో నటిస్తూనే ఉంది. ఇప్పుడు తనకి మళ్లీ హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?
సీనియర్ నటుడు శశికుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఇందులో సిమ్రాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శడుకు లోకేష్ కనకరాజ్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో ఇద్దరు బిడ్డల తల్లిగా సిమ్రాన్ నటిస్తుందనేది ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇతర పాత్రల్లో యోగిబాబు, మిథున్ జైశంకర్, కమలేష్, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్, బక్స్, ఇళంగో కుమారవేల్, శ్రీజా రవి తదితరులు నటిస్తున్నారు.
అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతం. డెబ్యూ డైరెక్టర్ అభిషన్ జీవింత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ తరపున నిర్మాతలు నజరేత్ బసిలియన్, మహేష్ రాజ్ బసిలియన్, యువరాజ్ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేయగా.. మంచి స్పందనను రాబట్టుకుంది.