మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shankar and Ajith Combo: శంకర్‌ దర్శకత్వంలో అజిత్‌? ఫ్యాన్స్ స్పందన చూస్తే షాకవ్వాల్సిందే

ABN, Publish Date - Jun 11 , 2024 | 08:11 PM

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ దర్శకత్వంలో అగ్రహీరో అజిత్‌ కుమార్‌ నటించనున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ తాము ముందుగా కమిట్‌ అయిన ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత వీరిద్దరి కలిసి పనిచేయబోతున్నారనే ప్రచారం కోడంబాక్కం వర్గాల్లో సాగుతుంది.

Ajith Kumar and Director Shankar

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ (Director Shankar) దర్శకత్వంలో అగ్రహీరో అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) నటించనున్నట్టు కోలీవుడ్‌ (Kollywood)లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ తాము ముందుగా కమిట్‌ అయిన ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన ‘ఇండియన్‌-2’ (Indian 2) వచ్చే నెలలో విడుదలకు సిద్ధమైంది. అలాగే, టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా అజిత్‌ కుమార్‌ కూడా మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయర్చి’ (Vidaa Muyarchi), ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత వీరిద్దరి కలిసి పనిచేయబోతున్నారనే ప్రచారం కోడంబాక్కం వర్గాల్లో సాగుతుంది.

Also Read- Ap Cm Oath Ceremony: బాబు ప్రమాణ స్వీకారం.. మెగాస్టార్‌కు ప్రత్యేక ఆహ్వానం!


ఇదే విషయంపై గత వారం అజిత్‌ను శంకర్‌ స్వయంగా కలిసి చర్చించినట్టు సమాచారం. కాగా, వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక్క చిత్రం కూడా రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలని అజిత్‌ ఫ్యాన్స్‌ (Ajith Kumar Fans) బలంగా కోరుకుంటున్నారు. కోలీవుడ్‌లో ఎప్పుడు అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య స్టార్ వార్ నడుస్తుంటుంది. అయితే ఈ మధ్య విజయ్ (Vijay) నూతన పార్టీ స్థాపించి.. పొలిటికల్ బాటకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ వంటి స్టార్ డైరెక్టర్‌తో అజిత్‌కు సినిమా పడితే.. ఆయన రేంజ్ మారడమే కాకుండా.. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఆయన తిరుగులేని స్టార్‌గా ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఈ కాంబినేషన్‌లో సినిమా ఓకే కావాలని అజిత్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి వారి ఆశలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Read Latest Cinema News

Updated Date - Jun 11 , 2024 | 08:11 PM