మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Madraskaaran: నిహారిక రీ ఎంట్రీ ఇస్తోన్న ‘మద్రాస్‌ కారన్‌’ ప్రారంభ విశేషాలివే..

ABN, Publish Date - Feb 15 , 2024 | 03:38 PM

షేన్‌ నిగమ్‌, నిహారిక కొణిదెల, ఐశ్వర్య దత్తా, కలైయరసన్‌తో ‘మద్రాస్‌ కారన్‌’ పేరుతో కోలీవుడ్‌లో ఒక చిత్రం తెరకెక్కనుంది. యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకునే ఈ చిత్రానికి వాలి మోహన్‌దాస్ దర్శకత్వం వహించనుండగా శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించనున్నారు. ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై నిర్మించే ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం తాజాగా చెన్నైలో జరుపుకుంది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Madraskaaran Movie Launch

షేన్‌ నిగమ్‌, నిహారిక కొణిదెల, ఐశ్వర్య దత్తా (Aishwarya Dutta), కలైయరసన్‌ (Kalaiyarasan)తో ‘మద్రాస్‌ కారన్‌’ (Madraskaaran) పేరుతో కోలీవుడ్‌లో ఒక చిత్రం తెరకెక్కనుంది. యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకునే ఈ చిత్రానికి వాలి మోహన్‌దాస్ (Vaali Mohandas) దర్శకత్వం వహించనుండగా శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించనున్నారు. ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై నిర్మించే ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం తాజాగా చెన్నైలో జరుపుకుంది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నటి ఐశ్వర్య దత్తా మాట్లాడుతూ... దర్శకుడు వాలితో కలిసి ఒక చిత్రం చేశా. ఆయన నా ఫేవరేట్‌ డైరెక్టర్‌. 2024లో ఈ చిత్రంలో నటించేందుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్‌ సీఎస్‌ మాట్లాడుతూ... మంచి కథ. ఇందులో ప్రతి ఒక్కరికీ మంచి పాత్రలు ఉంటాయి. ఎమోషన్స్‌ ఎక్కువ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ వచ్చేకొద్ది ఈ స్టోరీ గురించి తెలుస్తుందన్నారు. (Madraskaaran Movie Launch)


నటి నిహారిక (Niharika) మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు కథ వినిపించగానే ఒకే చెప్పేశాను. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంతో ముఖ్యమని నమ్ముతున్నా. షేన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. దర్శకుడు వాలి మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత కథ గురించి మాట్లాడుతానని తెలపగా.. హీరో షేన్‌ నిగమ్‌ (Shane Nigam) మాట్లాడుతూ.. చిన్న వయసు నుంచే తమిళ చిత్రాలు చూస్తూ పెరిగా. కేరళలో తమిళ హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. తమిళ చిత్రంలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*‘ఏజెంట్’ బాటలోనే సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’.. కాకపోతే?

***********************

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

Updated Date - Feb 15 , 2024 | 03:38 PM