Sevakar: కథ లేకుంటే నిర్మాతే లేడు.. నిర్మాతకు దర్శకుడు కౌంటర్
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:42 PM
నిర్మాత లేకుంటే దర్శకుడు, హీరో లేరని నిర్మాత కె.రాజన్ అంటున్నారనీ, తన వరకు మంచి కథంటూ లేకపోతే అస్సలు నిర్మాత అనేవారే లేరని సీనియర్ దర్శక నటుడు కె.భాగ్యరాజ్ అన్నారు. సిల్వర్ మూవీస్ పతాకంపై రాజన్ జోసెఫ్ థామస్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన చిత్రం ‘సేవకర్’. ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమంలో నిర్మాత కె. రాజన్ కామెంట్స్‌కు కె.భాగ్యరాజ్ కౌంటర్ ఇచ్చారు.
నిర్మాత లేకుంటే దర్శకుడు, హీరో లేరని నిర్మాత కె.రాజన్ (K Rajan) అంటున్నారనీ, తన వరకు మంచి కథంటూ లేకపోతే అస్సలు నిర్మాత అనేవారే లేరని సీనియర్ దర్శక నటుడు కె.భాగ్యరాజ్ (K Bhagyaraj) అన్నారు. సిల్వర్ మూవీస్ పతాకంపై రాజన్ జోసెఫ్ థామస్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన చిత్రం ‘సేవకర్’ (Sevakar). ప్రిజన్, షకానా జంటగా నటించగా.. బోస్ వెంకట్, ఆడుకలం నరేన్, మదురై శరవణన్, ఉడుమలై రాజేష్, షీమా శంకరి, రూపా, సునీల్, బాలు, షాజి కృష్ణ, సాయి శంకర్ తదితరులు నటించారు. సంతోష్ గోపీనాథ్ కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో రిలీజ్ తాజాగా చెన్నై నగరంలో జరిగింది.
Also Read- Nagababu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మెగాబ్రదర్ సంచలన వ్యాఖ్యలు
ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ.. ‘‘ఒక చిత్రానికి దర్శకుడు, హీరో కంటే నిర్మాత ముఖ్యం. కోలీవుడ్‌లో యేడాదికి 200కు పైగా చిత్రాలు వస్తున్నాయి. 150 మంది నిర్మాతలు కనిపించకుండా పోతున్నారు. దీనికి కారణం ఎవరు? ఒక నిర్మాత బాగుండాలని ఏ నటుడైతే కోరుకుంటారో ఆ హీరో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఇటీవలికాలంలో పెద్ద హీరోల చిత్రాలు నిరాశపరిచినప్పటికీ చిన్న చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇది చిత్రపరిశ్రమకు, చిన్న నిర్మాతలకు మంచిది. ఈ ‘సేవకర్’ సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలబడాలని కోరుకుంటున్నా’’నని అన్నారు. (Sevakar Audio Launch)
మరో అతిథి, సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజ్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత లేకుండా దర్శకుడు, హీరో లేరంటున్నారు. నిజం చెప్పాలంటే మంచి కథ లేకుంటే నిర్మాతే లేడు. ఒక వ్యక్తికి సినిమాపై వ్యామోహం పెరిగితే అది ఎన్నటికీ పోదు. ఈ సినిమాను 25 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేయడం శుభపరిణామం. ‘16 వయదిలే’ చిత్రం కూడా 32 రోజుల్లో నిర్మించారు. సూపర్ హిట్ అయింది. ఎన్నిరోజుల్లో పూర్తి చేశామన్న అంశంతో ఒక చిత్రం జయాపజయాలను నిర్ణయించలేం. మంచి కథ ఉండాలి. ఈ సినిమాకు అది ఉందని నమ్ముతున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక నిర్మాతలు, హీరో, హీరోయిన్, ఇతర నటీనటులు ప్రసంగించారు.
Also Read- Tirupati Controversy: లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య
Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే
Read Latest Cinema News