Santhanam: నవ్వించేందుకే సినిమాల్లో నటిస్తున్నా.. వివాదాల కోసం కాదు
ABN, Publish Date - Feb 11 , 2024 | 11:41 PM
తాను వివాదాలను సృష్టించడం కోసం సినిమాల్లో నటించడం లేదని, కేవలం ప్రేక్షకులను నవ్వించడం కోసమే నటిస్తున్నానని హీరో సంతానం అన్నారు. కార్తీక్ యోగి దర్శకత్వంలో సంతానం, మేఘాఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘వడక్కుపట్టి రామస్వామి’. ఈనెల 2న విడుదలైన ఈ చిత్రం సూపర్‌డూపర్ హిట్ సాధించింది. దీన్ని పురస్కరించుకుని చెన్నైలో సక్సెస్ మీట్‌ను చిత్ర బృందం నిర్వహించింది.
తాను వివాదాలను సృష్టించడం కోసం సినిమాల్లో నటించడం లేదని, కేవలం ప్రేక్షకులను నవ్వించడం కోసమే నటిస్తున్నానని హీరో సంతానం అన్నారు. కార్తీక్ యోగి దర్శకత్వంలో సంతానం, మేఘాఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘వడక్కుపట్టి రామస్వామి’. నిళల్‌గల్ రవి, ఎంఎస్ భాస్కర్, తమిళ్, మారన్, రాజేంద్రన్, జాన్‌విజయ్, రవిమారియా, కూల్ సురేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈనెల 2న విడుదలైన ఈ చిత్రం సూపర్‌డూపర్ హిట్ సాధించింది. దీన్ని పురస్కరించుకుని చెన్నైలో సక్సెస్ మీట్‌ను చిత్ర బృందం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరో సంతానం మాట్లాడుతూ... మీడియా ఇచ్చిన పాజిటివ్ రివ్యూలే ఈ చిత్ర ఘన విజయానికి కారణం. ప్రేక్షకులను నవ్వించడమే నా వృత్తి. ఈ సినిమా విడుదలకు ముందు టైటిల్ విషయంలో వివాదం చెలరేగింది. విడుదలైన తర్వాత థియేటర్‌కు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకున్నారు. నాకు దేవుడి భక్తి ఎక్కువ. ఎవరి నమ్మకాలు వారివి. మూఢ నమ్మకంతో పాటు దైవభక్తిని కలగలిపి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారని అన్నారు. దర్శకుడు కార్తీక్ యోగి మాట్లాడుతూ... ‘ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం మీడియానే. మీతో పాటు చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. బడ్జెట్‌కు వెనుకాడకుండా, క్వాలిటీలో రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. (Vadakkupatti Ramasamy Success Meet)
సీనియర్ నటుడు ఎంఎస్ భాస్కర్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం హీరో సంతానం ఎంతగానో శ్రమించారు. ఆయన హార్డ్‌వర్క్‌కు దక్కిన ప్రతిఫలమిది. ఒక సినిమా విజయం ఎంతోమంది నటులకు లైఫ్ ఇస్తుంది. అలాంటిదే వడక్కుపట్టి రామస్వామి సక్సెస్ అని అన్నారు. హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు ఎంతో ముఖ్యం. షూటింగ్ సమయంలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ.. ఈ ఘన విజయం అవన్నీ మరిచిపోయేలా చేసిందని అన్నారు. ఇంకా చిత్ర బృంద సభ్యులు ప్రసంగించారు. కాగా, ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Harish Shankar: దమ్ముంటే హరీష్ శంకర్ తెల్లవార్లు మద్యం తాగాడని రాయ్..
***************************
*Ooru Peru Bhairavakona: మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు
***************************
*Harish Shankar: ‘ఈగల్’లో లవ్ స్టోరీ లేదు.. ‘ఆర్ఆర్ఆర్’లో రొమాన్స్ లేదు
*************************
*Nikhil: అప్పుడే నిఖిల్‌కు డైపర్ క్లాస్‌లు మొదలయ్యాయ్..
***************************