Rajinikanth: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా..
ABN, Publish Date - Dec 03 , 2024 | 04:07 PM
సూపర్ స్టార్ రజినీకాంత్ తన 74వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా అందించడానికి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ అప్డేట్స్ ఏంటంటే..
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన వయస్సు పెరుగుతున్న కొద్దీ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇక డిసెంబర్ వచ్చిందంటే చాలు ఆయన అభిమానులు అప్డేట్స్ కోసం వేచి చూస్తుంటారు. ఆయన కూడా వారిని ఏ మాత్రం నిరాశపరచకుండా సూపర్ అప్డేట్స్ తో అలరిస్తుంటాడు. ఈ డిసెంబర్‌కి ఆయన సూపర్ డబుల్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఉత్సాహపరచనున్నాడు. ఇంతకీ ఆ అప్డేట్స్ ఏంటంటే..
ఇటీవల రిలీజైన 'వేట్టయాన్' మూవీ కాస్త నిరాశపరిచిన ఆయన సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో జతకట్టి స్ట్రాంగ్ లైనప్ తో కనిపిస్తున్నారు. ఫస్ట్ 'విక్రమ్' సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ తో 'కూలి', తర్వాత ఆయన రీసెంట్ కెరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన 'జైలర్' సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్ 2' సినిమాలతో ముందుకు రానున్నాడు. ఇప్పటికే రిలీజైన 'కూలీ' సినిమా గ్లిమ్ప్స్‌కి సూపర్ రెస్పాన్స్ రాగ డిసెంబర్ 12న మరో వీడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక 'జైలర్ 2' సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ ని కూడా బర్త్ డే రోజే రిలీజ్ చేయనున్నారు.
'కూలీ' సినిమాలో ఇప్పటికే ఈ సినిమాలో తెలుగు నుండి కింగ్ నాగార్జున, మలయాళం నుండి సౌబిన్ షాహిర్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు తమిళ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ తో పాటు 'అమీర్ ఖాన్' ఓ కీలక రోల్ లో నటించనున్నట్లు టాక్. కేవలం సినిమా క్యాస్ట్ ప్రకటించి నేషనల్ వైడ్‌గా బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. సౌతిండియా నుండి అన్ని భాషల స్టార్లను క్యాస్ట్ చేసిన కనగరాజ్ సినిమాకి అనిరుధ్ సంగీతం అడిషనల్ ఎసెట్.