Madhavan: రీల్, రియల్ హీరో.. కల అంటే ఇలా ఉండాలి

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:03 AM

కలలు ఎవరైనా కంటారు.. కానీ వాటిని సాకారం చేసుకున్నవాడే రియల్ హీరో అవుతాడు. మరి మన రీల్ హీరో మాధవన్ అసలు ఏం కల కన్నాడు? ఇంతకీ ఆ కలని సాకారం చేసుకున్నాడా?

R Madhavan

విభిన్న పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మూడు దశాబ్దాలుగా అలరిస్తున్న నటుడు ఆర్. మాధవన్ (R. Madhavan). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో సినిమాలు చేస్తున్నారు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’, ‘సాలా కదూస్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతులు అందించారు. ప్రస్తుతం ఆయన వార్తల్లో ట్రెండింగ్ లోకి వచ్చారు. ఆయన ఏం చేశారంటే..


కలలు ఎవరైనా కంటారు.. కానీ వాటిని సాకారం చేసుకున్నవాడే రియల్ హీరో అవుతాడు. మరి మన రీల్ హీరో మాధవన్ అసలు ఏం కల కన్నాడు? ఇంతకీ ఆ కలని సాకారం చేసుకున్నాడా? అవును, ఆయన అమెరికాలో స్కూలింగ్ చేశారు. అక్కడ ఆయన గ్రాడ్యుయేషన్ బుక్ లో లైఫ్ యాంబిషన్ 'మోస్ట్ రిచ్, ఫేమస్ యాక్టర్'గా ఎదగాలని కోరుకుంటున్న అని రాశారు. అలాగే అన్ని విభాగాల్లో పట్టు కలిగి ఉండి, కొన్ని విభాగాల్లో అయినా మాస్టర్ గా మారాలి అని రాశారు. తాజాగా ఈ ఫోటోని ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. చిన్నప్పుడే తను కన్నా కలని నెరవేర్చుకున్న మ్యాడీ రీల్ అండ్ రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.


మరోవైపు మాధవన్‌ ‘అదృష్టశాలి’గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. ‘యారడి నీ మోహిని’, ‘తిరుచిట్రాంబలం’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులను జరుపుకుంటోంది. ఫాంటసీ డ్రామా కోణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఏఏ మీడియా కార్పొరేషన్‌ బ్యానరుపై షర్మిల, రేఖా విక్కి, మనోజ్‌ ముల్కి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌ కూడా స్కాట్లాండ్‌లో పూర్తిచేశారు. మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్‌, రాధిక, సాయి తన్షిక, జగన్‌, నిరూప్‌ ఎన్‌కే, ఉపాసన ఆర్‌సీ, మ్యాథ్యూ వర్గీస్‌, ఉదయ్‌ మహేశ్‌, కేఎస్‌జీ వెంకటేష్‌, రవిప్రకాష్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించే ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 01:29 PM