Pugazh: ప్రసాద్ ల్యాబ్ ఎదురుగా కార్లు శుభ్రం చేశా.. ఇప్పుడా ప్రివ్యూ థియేటర్‌లో నా మూవీ వేడుక జరిపా..
ABN, Publish Date - Feb 11 , 2024 | 05:47 PM
ఇదే ప్రసాద్ ల్యాబ్ ఎదురుగా కార్లు శుభ్రం చేశానని, ఇప్పుడు అదే ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో తాను హీరోగా నటించిన చిత్రం ఆడియో రిలీజ్ వేడుక జరుగుతోందని హాస్య నటుడు పుగళ్ తెలిపారు. జీ4 స్టూడియోస్ సమర్పణలో ఎస్.రాజారత్నం, డి.జెఫా జోన్స్ నిర్మాణంలో జె.సురేష్ దర్శకత్వంలో వచ్చిన ‘కుక్ విత్ కోమాలి’తో ఫేమస్ అయిన పుగళ్ తొలిసారి హీరోగా నటించిన చత్రం ‘మిస్టర్ జూ కీపర్’. తాజాగా ఈ చిత్ర ఆడియో వేడుకను మేకర్స్ నిర్వహించారు.
ఇదే ప్రసాద్ ల్యాబ్ ఎదురుగా కార్లు శుభ్రం చేశానని, ఇప్పుడు అదే ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో తాను హీరోగా నటించిన చిత్రం ఆడియో రిలీజ్ వేడుక జరుగుతోందని హాస్య నటుడు పుగళ్ (Pugazh) తెలిపారు. జీ4 స్టూడియోస్ సమర్పణలో ఎస్.రాజారత్నం, డి.జెఫా జోన్స్ నిర్మాణంలో జె.సురేష్ (J Suresh) దర్శకత్వంలో ‘కుక్ విత్ కోమాలి’ ద్వారా ఫేమస్ అయిన పుగళ్ తొలిసారి హీరోగా నటించిన చత్రం ‘మిస్టర్ జూ కీపర్’. పులిని రక్షించడానికి కష్టపడే ఒక సాదాసీదా వ్యక్తి ఎదుర్కొనే సమస్యల చుట్టూ కేంద్రీకృతమై ఈ చిత్రం స్ర్కీన్‌ప్లే సాగుతుంది. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్‌ను తాజాగా చెన్నైలో విడుదల చేశారు. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని పుగళ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరో పుగళ్ మాట్లాడుతూ... ‘‘ఇదే ప్రసాద్ ల్యాబ్ ఎదురుగా కార్లు శుభ్రం చేసిన నేను... ఇప్పుడు ఇదే ల్యాబ్‌లో నా చిత్రం ఆడియో రిలీజ్ వేడుక జరుపుకోవడం జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం. ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు ఒక రోజు నన్ను పిలిచి... నీవు హీరో, పులితో ఫైట్ చేయాలి. పైగా యువన్ శంకర్‌రాజా (Yuvan Shankar Raja) సంగీతం అని చెప్పడంతో నోట మాట రాలేదు. అయితే, ఒక యేడాది పాటు షూటింగ్ ప్రారంభంకాలేదు. ఆ తర్వాత నిజంగానే ఒక పులిని తీసుకొచ్చి అంబులెన్స్‌లో కట్టేసి నటించమన్నారు. ఒరిజినల్ పులితో కలిసి నటించాను. ఈ చిత్ర కథపై నమ్మకంపెట్టి పూర్తి సహాయ సహకారాలు అందించిన నిర్మాతకు ధన్యవాదాలు. నా సరసన నటించేందుకు అనేక మంది హీరోయిన్లు నిరాకరించినప్పటికీ స్టోరీపై ఉన్న బలమైన నమ్మకంతో సమ్మతించిన హీరోయిన్ షిరిన్‌కు ధన్యవాదాలు’’ అని అన్నారు.
హీరోయిన్ షిరిన్ (Shirin) మాట్లాడుతూ... ‘ఇలాంటి చిత్రంలో నటించేందుకు అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. హీరోగా మారిన పుగళ్‌కు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. దర్శకుడు సురేష్ మాట్లాడుతూ... ‘ఈ చిత్రానికి వెన్నెముక యువన్ శంకర్‌రాజా. పాతికేళ్ల నుంచి స్నేహితులం. ఈ స్టోరీ తొలుత వినిపించింది యువన్‌కే. ఆ తర్వాత ఓ టీవీ షోలో పుగళ్‌ను చూశా. అప్పుడే అతన్ని హీరోగా చేసి ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నా. పుగళ్‌కు ఇది మంచి అవకాశం. నిజమైన పులితో షూటింగ్ చేయడం ఒక పాఠం. హీరోయిన్ షిరిన్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అలాగే, నిర్మాతలు, ఇతర యూనిట్ ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Nikhil: అప్పుడే నిఖిల్‌కు డైపర్ క్లాస్‌లు మొదలయ్యాయ్..
***************************
*Devara: మరో హీరోయిన్ ఈ మరాఠీ బ్యూటీనా.. ఫొటోలు వైరల్
******************************
*Priyamani: అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నా..
******************************
*Bade Miyan Chote Miyan: ఉత్కంఠ పెంచేస్తోన్న ‘బడే మియా చోటే మియా’ మేకింగ్ వీడియో
************************