Producer: అందుకు రూ.3 లక్షలు ఇవ్వాలంట.. హీరోయిన్‌పై నిర్మాత ఫైర్!
ABN, Publish Date - Aug 01 , 2024 | 07:38 PM
నడిగర్ సంఘంలో సభ్యత్వమే లేని వేరే రాష్ట్రానికి చెందిన హీరోయిన్ అపర్ణతిపై ప్రముఖ నిర్మాత సురేష్ కామాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్ర ప్రమోషన్ కోసం రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన ఏకైక నటి అపర్ణతి అని, ఆమె ఎప్పుడూ ‘ఔట్ ఆఫ్ స్టేషన్’లోనే ఉండాలని, అలా ఉంటేనే తమిళ చిత్రసీమకు ఎంతో మంచిదన్నారు.
నడిగర్ సంఘంలో సభ్యత్వమే లేని వేరే రాష్ట్రానికి చెందిన హీరోయిన్ అపర్ణతి (Heroine Abarnathi)పై ప్రముఖ నిర్మాత సురేష్ కామాక్షి (Suresh Kamatchi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్ర ప్రమోషన్ కోసం రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన ఏకైక నటి అపర్ణతి అని, ఆమె ఎప్పుడూ ‘ఔట్ ఆఫ్ స్టేషన్’లోనే ఉండాలని, అలా ఉంటేనే తమిళ చిత్రసీమకు ఎంతో మంచిదన్నారు. వీ6 ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎస్.వేలాయుధం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నర్కరాపోర్’ (Narkarapor). దర్శకులు హెచ్. వినోద్, రాజపాండి తదితరుల వద్ద పనిచేసిన శ్రీవెట్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Also Read- Raj Tarun: ఆరోపణలు మాత్రమే, ఆధారాలు చూపించలేదు.. లావణ్య వివాదంపై రాజ్ తరుణ్
పారిశుద్ధ్య కార్మిక కుటుంబానికి చెందిన ఒక యువకుడు గ్రాండ్ మాస్టర్ ఎలా అవుతాడు? తన లక్ష్య సాధనలో చదరంగం క్రీడలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? తదితర అంశాలతో స్పోర్ట్స్ డ్రామాతో ఈ సినిమాను రూపొందించారు. ‘ఇరుగపట్రు’ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందిన అపర్ణతి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ‘సేతుమన్’ ఫేం అశ్విన్ హీరోగా, సురేష్ మేనన్ ప్రతి నాయకుడిగా నటించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు మేజర్ రవి తనయుడు అర్జున్ రవి ఈ సినిమా ద్వారా కెమెరామెన్‌గా పరిచయమవుతున్నారు. సంతోష్ నారాయణన్‌తో కలిసి పనిచేసిన దినేష్ ఆంటోనీ సంగీతం సమకూర్చారు. నిర్మాత సురేష్ కామాక్షి తన సొంత నిర్మాణ సంస్థ వి హౌస్ బ్యానరులో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయగా, తాజాగా ట్రైలర్, ఆడియో రిలీజ్ చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. (Narkarapor Audio Launch)
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కామాక్షి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ ముఖ్యం కాదు. కంటెంట్ ప్రధానం. ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్‌తో తెరకెక్కిన చిన్న చిత్రాలే మంచి విజయాన్ని సాధించి కలెక్షన్లు రాబట్టాయి. హీరోయిన్ అపర్ణతి ఈ సినిమా ప్రమోషన్‌కు రాకపోవడం విచారకరం. నటీనటులు ప్రమోషన్లకు రాకపోవడం పరిశ్రమకు ఒక శాపంలా మారింది. ఈ సినిమా ప్రమోషన్‌కు వచ్చేందుకు అపర్ణతి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. పైగా అనేక కండిషన్లు కూడా పెట్టారు. అవన్నీ బహిర్గతం చేస్తే పెద్ద వివాదమే అవుతుంది. ఇపుడు ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నారట.. ఆమె అక్కడ ఉండటమే తమిళ సినిమాకు మంచిది’ అన్నారు.
నటి నమిత మాట్లాడుతూ.. ‘‘తమిళ అభిమానులకు సినిమా అంటే వినోదం. సమాజానికి కావాల్సిన సందేశం కూడా ఉండాలి. దేశంలో క్రీడా రంగం అభివృద్ధి చెందుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఉంటే వారిని ప్రోత్సహించాలి’’ అని పిలుపునిచ్చారు. అలాగే, దర్శకులు అముదగానం, యురేఖ, లెనిన్ భారతి, సుబ్రహ్మణ్య శివ, మీరా కదిరవన్, నటుడు కవితా భారతి, నటి కోమల్ శర్మ తదితరులు ప్రసంగించారు. (Narkarapor Trailer Release Event)
Read Latest Cinema News