మూవీ రివ్యూలపై సముచిత నిర్ణయం తీసుకోవాలి: నిర్మాత

ABN, Publish Date - Nov 29 , 2024 | 09:22 PM

ప్రస్తుతం రివ్యూలపై సినీ ఇండస్ట్రీలో ఎటువంటి రచ్చ జరుగుతుందో తెలిసిందే. ఈ రివ్యూలను ఆపేయాలంటూ ఇటీవల కోలీవుడ్‌లో సినీ ప్రముఖులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాత రివ్యూలపై పాజిటివ్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారి చర్చనీయాంశం అవుతోంది. వివరాల్లోకి వెళితే..

Silent Movie Audio Launch

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పలువురు దర్శక నిర్మాతలు సినిమా రివ్యూలను వ్యతిరేకిస్తున్నారనీ, తన విషయానికి వస్తే ఒక సినిమాకు రివ్యూ ఎంతో ముఖ్యమని ప్రముఖ నిర్మాత, వి హౌస్‌ నిర్మాణ సంస్థ అధినేత సురేష్‌ కామాక్షి అభిప్రాయపడ్డారు. గణేశ పాండి దర్శకత్వంలో ఎస్పీ రాజాసేతుపతి సమర్పణలో ఎస్‌. రాంప్రకాష్‌ ఎస్‌పీఆర్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై నిర్మించిన చిత్రం ‘సైలెంట్‌’. హీరోయిన్‌గా ఆరాధ్య, మురళి రాధాకృష్ణన్‌, సమయమురళి, ఆరం రామ్స్‌, బిగ్‌బాస్‌ నమీత, మారిముత్తు తదితరులు నటించారు. చెన్నై దక్షిణ ఐఆర్‌ఎస్‌, జీఎస్టీ అదనపు కమిషనరు టి. సమయమురళి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకుడు శీను రామస్వామి, నిర్మాత సురేష్‌ కామాక్షి హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు.

Also Read-Samantha: సమంత ఇంట్లో విషాదం.. ఆమె తండ్రి మృతి

ఈ సందర్భంగా సురేష్‌ కామాక్షి మాట్లాడుతూ.. సినిమా రివ్యూలపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక సినిమాకు రివ్యూ తప్పనిసరి. తొలి షోకు ప్రేక్షకులు లేకుంటే రెండో ఆట ప్రదర్శనకు అవకాశమే లేదు. అందువల్ల రివ్యూల విషయంలో చిత్రపరిశ్రమ సముచితంగా చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. రివ్యూల వల్ల లాభం కూడా ఉంది. ఒక చిన్న సినిమాకు మంచి రివ్యూ వస్తే.. ప్రేక్షకులకు త్వరగా ఆ సినిమా రీచ్ అవుతోంది. మౌత్ టాక్‌తో పాటు రివ్యూలు కూడా అవసరమే. కానీ అది ఎంత మేరకు, ఎలా ఉండాలనేదానిపై సముచిత నిర్ణయం తీసుకుంటే మంచింది. ‘సైలెంట్’ సినిమా అందరికీ మంచి పేరు తీసుకువచ్చి, మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.


దర్శకుడు శీను రామస్వామి మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకు చిన్నబడ్జెట్‌ చిత్రాలకు మీడియా మద్దతు తెలుపుతుంది. రివ్యూ లేకుంటే చిన్న సినిమాలు వచ్చేది, పోయేది తెలియదు. ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని ప్రసారం చేసేందుకు అనుమతించాలని ఆయన కోరారు. చిత్ర దర్శకుడు గణేషా పాండి మాట్లాడుతూ.. ఈ సినిమా నా మొదటి బిడ్డ. ఈ టైటిల్‌‌కు, నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చిన్నపుడు నోరు తెరిచేవాడిని కాదు. ఆ తర్వాత పేదరికం, జీవన పోరాటం ఇలా అనేక విషయాలకు సమాధానమే ఈ సినిమా. మీడియా ప్రతినిధులు ఆదరాభిమానాలను కోరుతున్నానని తెలిపారు.

Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే

Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్ష‌జ్ఞ'

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2024 | 09:22 PM