Indian 2: ‘ఇండియన్-2’కి స్పెషల్ షో ఒక్క రోజే!
ABN, Publish Date - Jul 12 , 2024 | 03:34 PM
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్-2’ ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకుందీ చిత్రం. ఈ సినిమా రిలీజ్‌ను పురస్కరించుకుని ప్రత్యేక షోలకు అనుమతివ్వాలని చిత్ర నిర్మాణ సంస్థలు కోరగా, తమిళనాడు ప్రభుత్వం మాత్రం కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే స్పెషల్ షోకు అనుమతిని ఇవ్వడం విశేషం.
విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘ఇండియన్-2’ (Indian 2) ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. శంకర్ (Director Shankar) దర్శకత్వంలో తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకుందీ చిత్రం. ఈ సినిమా రిలీజ్‌ను పురస్కరించుకుని ప్రత్యేక షోలకు అనుమతివ్వాలని చిత్ర నిర్మాణ సంస్థలు కోరగా, తమిళనాడు ప్రభుత్వం మాత్రం కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే స్పెషల్ షోకు అనుమతిని ఇవ్వడం విశేషం. తెలంగాణ (Telangana)లో ఈ సినిమాకు వారం రోజుల పాటు అదనపు షోలకు అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ తమిళనాడులో కేవలం ఒకే ఒక్క రోజు ఇవ్వడంతో అంతా ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారు. ‘ఇండియన్-2’ సినిమా విడుదల రోజైన శుక్రవారం మాత్రమే ఉదయం 9 గంటలకు స్పెషల్ షో (అదనపు ఆట) ప్రదర్శించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చింది. (Indian 2 Special Show)
Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?
అయితే తమిళనాడు ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణం లేకపోలేదు. గతంలో హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన ‘తుణివు’ విడుదల సమయంలో కోయంబేడులోని రోహిణి థియేటర్ వద్ద ఓ విషాదకర ఘటన జరిగింది. ఆ సమయంలో అజిత్ అభిమానుల్లో ఒకరు మరణించారు. అప్పటి నుంచి స్పెషల్ షోలకు అనుమతివ్వడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ‘ఇండియన్-2’కు మాత్రం 12వ తేదీ ఉదయం 9 గంటల ఆటకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కాగా, ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్, రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ.. స్వయానా తమిళ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, అలాగే రాష్ట్ర మంత్రి, సినీ హీరో ఉదయనిధి (Udhayanidhi Stalin) సొంత నిర్మాణ సంస్థ కావడం గమనార్హం.
Read Latest Cinema News