Suriya: ‘కంగువా’ నిర్మాతకు భారీ నష్టం.. సూర్య ఏం చేస్తున్నారంటే?
ABN, Publish Date - Dec 09 , 2024 | 04:36 PM
హీరో సూర్యకు నిర్మాతల హీరో అని పేరు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతుంటారు. అయితే తాజాగా సూర్య నుండి వచ్చిన భారీ చిత్రం ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద భారీ లాస్‌ని చవి చూసింది. దీంతో నిర్మాత కష్టాలలోకి కూరుకుపోయారు. దీంతో సూర్య మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇంతకీ సూర్య ఏం చేస్తున్నారంటే..
కోలీవుడ్‌లో బడా నిర్మాతైన స్టూడియో గ్రీన్ అధినేత నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాను ఆదుకునేందుకు హీరో సూర్య మరోసారి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. గతంలో కూడా ఈ నిర్మాత కష్టాల్లో ఉన్న సమయంలో సూర్య ఆదుకున్న విషయం తెల్సిందే. ఇపుడు జ్ఞానవేల్ రాజా మరోమారు ఆర్థిక కష్టాల్లో కూరుకున్నారు. సూర్య హీరోగా, చిరుత్తై శివ దర్శకత్వంలో వచ్చిన ‘కంగువా’ (Kanguva) చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజాతో పాటు పంపిణీదారులు భారీ నష్టాలను చవిచూశారు. ఈ సినిమా తొలి ఆట నుంచే వచ్చిన నెగిటివ్ రివ్యూలు కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో నిర్మాతకు భారీ నష్టం వాటిల్లింది.
Also Read-Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?
ఇటీవల కాలంలో జ్ఞానవేల్ రాజా భారీగా నష్టపోవడం ఇదేనని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో తన నిర్మాతను ఆదుకునేందుకు హీరో సూర్య ముందుకు వచ్చారు. స్టూడియో గ్రీన్ బ్యానరులో మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. ఇందుకోసం సరైన కథాన్వేషణలో సంబంధిత వర్గాలు నిమగ్నమైవున్నాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న చిత్రాలను పూర్తి చేశాక.. జ్ఞానవేల్ రాజా నిర్మించే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు దర్శకుడు, ఇందులో నటించే నటీనటులు ఎవరన్నది త్వరలోనే తెలియనుంది.
అయితే ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుండి సూర్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సూర్యని నిర్మాతల హీరో అనేది అందుకే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘సూర్య అన్న బంగారం’, ‘అందుకే అందరూ సూర్యని ఇష్టపడతారు’ అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో సూర్య పేరు ట్రెండ్ అవుతోంది. అయితే ‘కంగువా’ విషయంలో మరో వార్త కూడా కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. సూర్య మరో సినిమా అవకాశం ఇవ్వడమే కాకుండా.. తన రెమ్యునరేషన్‌లో కొంత అమౌంట్ కూడా తిరిగి ఇచ్చాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
‘కంగువా’ విషయానికి వస్తే.. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.