40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: రజనీ అభిమానులతో పొరుగింటి వృద్ధ మహిళ వాగ్వాదం

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:03 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పాటు ఆయన అభిమానులపై ఓ వృద్ధ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగులు, పుట్టిన రోజు వేడుకల సమయంలో తమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, పండుగ పూట దేవుడికి పూజ కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తేనాంపేటలోని పొయెస్‌ గార్డెన్‌లో రజనీకాంత్‌ నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.

Rajinikanth and His Neighbour

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth)తో పాటు ఆయన అభిమానులపై ఓ వృద్ధ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగులు, పుట్టిన రోజు వేడుకల సమయంలో తమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, పండుగ పూట దేవుడికి పూజ కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తేనాంపేటలోని పొయెస్‌ గార్డెన్‌లో రజనీకాంత్‌ నివాసం ఉంటున్నారు. ఆయన పుట్టిన రోజుతో పాటు పండుగల సమయంలో శుభాకాంక్షలు చెప్పేందుకు రజనీ నివాసానికి భారీగా అభిమానులు తరలివస్తుంటారు. ఆ సమయంలో రజనీకాంత్‌ ఇంట్లో లేకపోయినప్పటికీ ఆయన అభిమానులు మాత్రం ఇంటి గేటు వద్దే నానా హంగామా సృష్టిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున కూడా ఇదేవిధంగా ప్రవర్తించారు. దీంతో రజనీకాంత్‌ పొరుగింటి వృద్ధ మహిళ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఆ వృద్ధ మహిళ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.


‘‘తలైవా తలైవా అంటూ ఫ్యాన్స్‌ నినాదాలు చేస్తుంటారు. మాతో పాటు ఈ వీధిలో ఉన్న 21 గృహాల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఏం.. మీ(రజనీ) ఇంటి గేటు తెరిచి అభిమానులను ఇంట్లోకి పిలవొచ్చు కదా. అక్కడే తలైవర్‌ను చూడొచ్చు కదా. మీరు గేట్లు మూసివేసివుంటారు.. వీరంతా మా గృహాల వాకిళ్ళలో కూర్చొని నానా హంగామా చేస్తుంటారు. మేం కూడా పన్ను చెల్లిస్తున్నాం. కానీ, మాకు ఒక్క ప్రయోజనం కూడా లేదు. చివరకు పండుగ రోజుల్లో కూడా ప్రశాంతంగా దేవుడిని పూజించేందుకు లేదు’’ అంటూ వాపోయారు. (Old Woman Express Angry on Rajinikanth Fans)

ఈ వీడియోకు కొందరు సపోర్ట్ చేస్తుంటే.. రజనీకాంత్ ఫ్యాన్స్ కొందరు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంట్లోకి వచ్చి మేమేం చేయడం లేదు కదా.. వీధిలోనే కదా.. మేం సంబరం చేసుకుంటుంది. అయినా మీ వీధిలో తలైవా ఉన్నందుకు మీరంతా గర్వంగా ఫీలవ్వాలి కానీ.. ఇలా సోషల్ మీడియాకు ఎక్కితే మీకే ప్రాబ్లమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారం: బాలకృష్ణ

**************************

*Ayalaan: కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్‌లో ఎప్పుడంటే?

****************************

*Naa Saami Ranga: బ్రేకీవెన్‌కి దగ్గరగా.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

*****************************

*Ajay Gadu: ‘అజ‌య్ గాడు’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి

******************************

Updated Date - Jan 18 , 2024 | 12:03 PM