Nayanthara: మరోమారు దేవతగా నయనతార.. అధికారికంగా వెల్లడి

ABN, Publish Date - Jul 14 , 2024 | 10:29 PM

సీనియర్‌ హీరోయిన్‌ నయనతార మరోమారు ‘మూక్కుత్తి అమ్మన్‌’గా ప్రేక్షకులను అలరించనున్నారు. 2020లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా ఓటీటీలో విడుదలైంది. అయినప్పటికీ మౌత్‌ పబ్లిసిటీ కారణంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ని అనౌన్స్ చేశారు.

Nayanthara in Mookuthi Amman

సీనియర్‌ హీరోయిన్‌ నయనతార (Nayanthara) మరోమారు ‘మూక్కుత్తి అమ్మన్‌’ (Mookuthi Amman)గా ప్రేక్షకులను అలరించనున్నారు. 2020లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా ఓటీటీలో విడుదలైంది. అయినప్పటికీ మౌత్‌ పబ్లిసిటీ కారణంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండో భాగాన్ని తెరకెక్కించనున్నట్టు నిర్మాణ సంస్థ వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ (Vels Film International) అధికారికంగా ప్రకటించింది. (Mookuthi Amman Sequel)

తొలి భాగంలో నయనతార ప్రధాన పాత్ర (దేవత పాత్ర)ను పోషించగా.. ఆర్జే బాలాజీ (RJ Balaji), ఊర్వశి, స్మృతి వెంకట్‌, మయిల్‌స్వామి ముఖ్య పాత్రలను పోషించారు. క్రిష్‌ సంగీతం అందించగా, డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో రిలీజ్‌ చేశారు. ఇపుడు రెండో భాగంలో నటించే నటీనటుల పేర్లను ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ.. తొలి భాగంలో నటించిన వారే నటించవచ్చని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘మూక్కుత్తి అమ్మన్‌’ చిత్రం తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరిట విడుదలై.. తెలుగులోనూ మంచి ఆదరణను రాబట్టుకుంది.


కథ విషయానికి వస్తే.. ఏంగెల్స్‌ రామస్వామి (ఆర్‌.జె.బాలాజీ) కాశీబుగ్గ పట్టణంలో రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు. అతని ప్రయత్నాలు, ఇంటిలోని వారి కోరికలు ఏవీ నెరవేరకపోవడంతో.. ఆ ఫ్యామిలీకి తెలిసినవాళ్లు.. వాళ్ల ఇంటి దైవం ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకోమని చెప్పగా.. ఫ్యామిలీ అంతా అలాగే చేస్తారు. అయితే అక్కడ రామస్వామికి ముక్కుపుడక అమ్మవారు (నయనతార) దర్శనమిస్తుంది. తన గుడిని తిరుపతి అంత గొప్ప దేవాలయం చేయాలని అడుగుతుంది. అమ్మవారు అలా ఎందుకు అడిగింది? అప్పుడు రామస్వామి ఏం చేశాడు? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఎప్పటి నుంచో ఈ సినిమా సీక్వెల్ అంటూ వార్తలు వస్తున్నప్పటికీ.. ఇప్పుడు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Updated Date - Jul 14 , 2024 | 10:29 PM