Nayanthara Vs Dhanush: ఒకే పెళ్లిలో నయనతార, ధనుష్.. ఏం చేశారో తెలుసా
ABN, Publish Date - Nov 22 , 2024 | 09:27 AM
హీరోయిన్ నయనతార, ధనుష్ మధ్యలో కోల్డ్ వార్ కొనసాగుతుంది. తాజాగా వీరిద్దరూ ఒకే పెళ్లికి హాజరై పక్క పక్కనే కూర్చున్నారు. తర్వాత ఏమైందంటే..
నయనతార వర్సెస్ ధనుష్ ఇష్యూ సినీవర్గాలతో పాటు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఇప్పటికే నయనతార సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ధనుష్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఒక పెళ్లి వేడుకలో ఒకరికి ఒకరు తారసపడ్డారు. ఇద్దరు ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. వివాదం నేపథ్యంలో ఈ వేడుకపై ఒకరిని చూసి ఒకరు ఎలా రియాక్టయ్యారు అంటే..
నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ రైట్స్ వివాదం నేపథ్యంలో నయనతార హీరో ధనుష్ పైన రెచ్చిపోయిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ప్రముఖ కోలీవుడ్ ప్రొడ్యూసర్ ఆకాష్ భాస్కరన్ వివాహ వేడుకకి హాజరయ్యారు. ఇద్దరు పక్క పక్క సోఫాలలో కూర్చున్నారు. కానీ.. ఒకరితో ఒకరు అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరోవైపు హీరో ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తలైవా రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ కంటే ఐశ్వర్య పెద్దదనే విషయం తెలిసిందే. చదువుకునే రోజుల్లో ధనుష్ వాళ్లక్క, ఐశ్వర్యకు మంచి స్నేహితురాలు. అలా, వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నాం అని రెండేళ్ల క్రితం ధనుష్ - ఐశ్వర్య ప్రకటించారు. పరస్పర అంగీకారంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్టోనే చెప్పారు. ‘‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్థమయ్యాం. ఐశ్వర్య, నేనూ విడిపోవా?ని నిర్ణయం తీసుకున్నాం’’ అని 2022లో ధనుష్ పోస్ట్ పెట్టారు. విడాకుల కోసం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా.. వీరిద్దరూ హాజరుకాలేదు. దీంతో వీరిద్దరూ తిరిగి కలుస్తారని అభిమానులు భావించారు. తాజా విచారణతో ఈ జంట విడిపోవడానికే నిర్ణయించుకుందని స్పష్టమైంది.