Megha Akash Couple: రాహుల్ గాంధీని కలిసిన మేఘా ఆకాష్ దంపతులు
ABN, Publish Date - Sep 29 , 2024 | 08:04 PM
హీరోయిన్ మేఘా ఆకాష్ తన భర్తతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. దీంతో సోషల్ మీడియా అంతా ఒక్కటే హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట రాహుల్ గాంధీని కలవడానికి కారణం ఏంటా అని అంతా చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే..
హీరోయిన్ మేఘా ఆకాష్ తన భర్తతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వారి వెంట టీఎన్‌సీసీకి చెందిన సీనియర్ నేత ఎస్.తిరునావుక్కరసు కూడా ఉన్నారు. కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘పేట్ట’ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన మేఘా ఆకాష్.. ఆ తర్వాత ధనుష్ సరసన ‘ఎన్నై నోక్కి పాయుం తోట్టా’, సింబుతో ‘వందా రాజావా దాన్ వరువేన్’తో పాటు ఇతర హీరోలతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఆమె చివరిసారిగా ‘సభానాయగన్’, ‘వడకుపట్టి రామస్వామి’, ‘మళై పిడిక్కాద మణిదన్’ చిత్రాల్లో నటించారు.
Also Read- Tollywood: ఈ సమ్మర్‌కి మరింత వేడి!
అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.తిరునావుక్కరసు రెండో కుమారుడు సాయి విష్ణును ప్రేమించి ఇటీవల పెళ్ళి చేసుకున్నారు. చెన్నై నగరంలో జరిగిన వీరి రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళి, రాహుల్ గాంధీని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. మేఘా ఆకాష్ దంపతులకి, రాహుల్ గాంధీకి సంబంధం ఏమిటంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Also Read- Sai Durgha Tej: మేనమామల దారిలో సాయి దుర్గ తేజ్.. తగ్గేదేలే
టాలీవుడ్ విషయానికి వస్తే.. నితిన్ నటించిన ‘లై’ (lie) సినిమాతో కథానాయికగా పరిచయమై టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయమైంది మేఘా ఆకాశ్ (Megha Akash). ‘ఛల్ మోహన్ రంగా’, ‘రాజ రాజ చోర’, ‘డియర్ మేఘా’, ‘పేట’, ‘కుట్టి స్టోరీ’, ‘రాధే’ వంటి చిత్రాల్లో మేఘా ఆకాశ్ నటించారు. ఇక మ్యారేజ్ అనంతరం మేఘా ఆకాశ్ సోషల్ మీడియాలో రిసెప్షన్ ఫొటోలతో పెట్టిన పోస్ట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘జీవితంలో తనకెంతో ఇష్టమైన అధ్యాయం ఇదే’ అంటూ ఆమె పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో ఆమె ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆగస్ట్‌లో మేఘ, సాయిల నిశ్చితార్థం జరిగింది.