Kushboo: ఆ సన్నివేశాల చిత్రీకరణలో నేను, విజయ్ నిజంగానే ఏడ్చేశాం

ABN , Publish Date - Jul 21 , 2024 | 07:56 PM

‘వారిసు’ చిత్రంలో విజయ్‌, తాను కలిసి నటించిన పలు సన్నివేశాలు ఎంతో ఎమోషనల్‌గా ఉంటాయని, వీటి చిత్రీకరణ సమయంలో నిజంగానే తామిద్దరం ఏడ్చేశామని నటి ఖుష్బూ చెప్పారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘వారిసు’ సినిమా గురించి ఆమె చెప్పుకొచ్చారు. దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌తో విడుదలైంది.

Vijay and Kushboo

‘వారిసు’ (Varisu) చిత్రంలో విజయ్‌, తాను కలిసి నటించిన పలు సన్నివేశాలు ఎంతో ఎమోషనల్‌గా ఉంటాయని, వీటి చిత్రీకరణ సమయంలో నిజంగానే తామిద్దరం ఏడ్చేశామని నటి ఖుష్బూ (Kushboo) చెప్పారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘వారిసు’ సినిమా గురించి ఆమె చెప్పుకొచ్చారు. దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) టైటిల్‌తో విడుదలైంది. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. అయితే ఈ సినిమా సీనియర్ నటి ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించింది కానీ.. ఆమె సన్నివేశాలను చివరి నిమిషంలో తొలిగించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై క్లారిటీ అన్నట్లుగా తాజాగా ఖుష్బూ ‘వారిసు’ (Kushboo About Varisu) గురించి చెప్పుకొచ్చారు.

Also Read- Niharika Konidela: దయచేసి కళ్యాణ్ బాబాయ్ గురించి అలాంటి ప్రశ్నలు అడగకండి..


‘‘విజయ్ ‘వారిసు’ చిత్రంలో నాకు, విజయ్‌కు మధ్య సాగే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా చిత్రీకరించారు. ఇది సోలో ట్రాక్‌. మంచి అందమైన ట్రాక్‌. కుటుంబ సన్నివేశం. ఆ సమయంలో నా సన్నివేశాలన్నీ విజయ్‌తో చిత్రీకరించారు. ఆ సినిమాలో ఇతర నటీనటులతో నాకు సీన్లు లేవు. నాకు, విజయ్‌కి ఆ సన్నివేశాలు ఎంతో ఎమోషనల్‌గా ఉంటాయి. వాటిని షూట్‌ చేస్తున్నపుడు విజయ్‌, నేను నిజంగానే ఏడ్చేశాం. అయితే, సినిమా నిడివి ఎక్కువ కావడంతో వాటిని తొలగించినట్టు దర్శకుడు వంశీ వెల్లడించారు. కాస్త డిజప్పాయింట్ అయ్యాను కానీ.. దర్శకుడికి ఏం కావాలో తెలుసు కాబట్టి.. ఆ తర్వాత అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ సీన్లు మాత్రం చాలా బాగా వచ్చాయి..’’ అని ఖుష్బూ తెలిపారు. దీంతో మరోసారి ‘వారిసు’ సినిమాపై కోలీవుడ్‌లో చర్చలు నడుస్తున్నాయి. (Kushboo Scenes Deleted in Varisu Movie)


Vijay-Kushboo.jpg

విజయ్ ప్రస్తుతం ‘ది గోట్’ (The Goat) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఖుష్బూ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘అరణ్మై 4’లో ఓ పాటలో కనిపించారు. ఈ సినిమాలో తెలుగులో ‘బాక్’ అనే టైటిల్‌తో విడుదలవగా.. ఖుష్బూ భర్త సుందర్ సి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Read Latest Cinema News

Updated Date - Jul 21 , 2024 | 07:56 PM

Vaarasudu: గ్రౌండ్‌లో ఎంత మంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు.. కానీ?

Vaarasudu: ‘ఇట్స్ ఫర్ యు అమ్మా - ది సోల్ ఆఫ్ వారసుడు’

Vaarasudu: ఆ ఫ్రెంచ్ సినిమాకు కాపీనా..?

Vaarasudu: థియేట్రికల్ ట్రైలర్

Kushboo : నా బెడ్‌రూమ్‌ నిండా ఆయన ఫొటోలే!